BigTV English

Dil Raju : చెప్పి చెప్పకుండా.. సగం చెప్పిన దిల్ రాజ్.. కన్ఫ్యూషన్ లో మెగా ఫాన్స్..

Dil Raju : చెప్పి చెప్పకుండా.. సగం చెప్పిన దిల్ రాజ్.. కన్ఫ్యూషన్ లో మెగా ఫాన్స్..
dil raju

Dil Raju : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ తర్వత రాబోతున్న నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్. నిజానికి ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం షూటింగ్లో జాప్యం వల్ల ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.. కానీ ఈ మూవీ ఎప్పటికప్పుడు డిలే అవుతూ ఉండడం చెర్రీ ఫాన్స్ కి బాగా చింత కలిగిస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీతో చెర్రీ ఇమేజ్ రెట్టింపు అవుతుంది అని మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.


శంకర్ తన కెరీర్ లో స్ట్రైట్ తెలుగు హీరోతో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఒకప్పుడు శంకర్ మెగాస్టార్ తో సినిమా చేయాలి అని ట్రై చేసినప్పటికీ కుదరలేదు. ఇదిగో ఇప్పటికి మెగాస్టార్ కొడుకుతో శంకర్ మూవీ చేయగలుగుతున్నాడు. దీంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది . ఇక ఈ మూవీలో రామ్ చరణ్ డబల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరోపక్క ఈ మూవీ కంటే వెనక మొదలైన చిత్రాలన్నీ వరుసగా విడుదల కూడా అయిపోతున్నాయి. తాజాగా రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్ పాల్గొన్న దిల్ రాజ్ గేమ్ చేంజర్ చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు. గత 15 రోజులుగా గేమ్ చేంజర్ కు సంబంధించిన షూటింగ్ మైసూర్లో జరుగుతుంది అని దిల్ రాజ్ చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిపోయిందని.. దిల్ రాజ్ తెలియజేయడంతో చెర్రీ ఫాన్స్ కాస్త ఊరట చెందారు.


కొందరు డైరెక్టర్స్ సినిమాని నిదానంగా .. పర్ఫెక్ట్ గా తీయాలని ప్రయత్నిస్తారని.. రాజమౌళి, సందీప్ ,సుకుమార్ ,శంకర్ వీళ్లంతా ఇదే టైప్ దర్శకులని దిల్ రాజ్ అన్నారు. అందుకే వీళ్ళని మనం తొందరపెట్టకూడదట.. ఎక్కడ రాజీపడరు కాబట్టి అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా వస్తుందట.. అంటే రాబోయే రామ్ చరణ్ మూవీ అద్భుతంగా ఉండబోతుందని దిల్ రాజ్ ఇన్ డైరెక్ట్ గా అప్పుడే హింట్ ఇచ్చాడు అని చెర్రీ అభిమానులు భావిస్తున్నారు. కచ్చితంగా మూవీ అంచనాలకు మించి వస్తుందని.. ఈ మూవీ కోసం డైరెక్టర్ ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారని.. మీరు కూడా కాస్త ఓపిక పట్టండి అంటూ మెగా అభిమానులను దిల్ రాజ్ కోరారు. మొత్తానికి త్వరలో చెర్రీ సినిమా బెస్ట్ మోడ్ లో వస్తుంది అన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది.. కానీ ఎప్పుడూ అనేది మళ్లీ ప్రశ్న గానే మిగిలిపోయింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×