E-Paper
Advertisement

Daaku Maharaj Collections : బాలయ్య ఊచకోత.. బాక్సాఫీస్ రికార్డు బ్రేక్.. ఎన్ని కోట్లంటే..?

Daaku Maharaj Collections : బాలయ్య ఊచకోత.. బాక్సాఫీస్ రికార్డు బ్రేక్.. ఎన్ని కోట్లంటే..?

Daaku Maharaj Collections : నందమూరి నటసింహం బాలయ్య ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు వరుసగా రికార్డులను బ్రేక్ చేసేలా కలెక్షన్స్ ను అందుకుంటుంది. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అయింది.. బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. ప్రతి ఏడాది బాలయ్య నుంచి వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా బాలయ్యకు ఆ సెంటిమెంట్ బాగానే పనిచేసింది.. డాకు మహారాజ్ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మూడు రోజులకు ఎంత రాబాట్టిందో ఒకసారి తెలుసుకుందాం..

డాకు మహారాజ్ హిట్ టాక్ రావడం భారీ అంచనాలతో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్‌లో రావడం తో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాయి సౌజన్యలు నిర్మించిన ఈ మూవీ రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు. ఇందులో బాలయ్య హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా చాందిని చౌదరి, హర్షవర్ధన్, హిమజ, బాబి డియోల్‌, ఊర్వశి రౌతెలా తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.. ఈ సినిమా అనుకున్నట్లే మంచి టాక్ ను అందుకుంది.. ఇక థమన్‌ బాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్గా నిలిచింది. అఖండ నుంచి బాలయ్య వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు..

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.67.30 కోట్ల బిజినెస్ జరిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్ల టార్గెట్‌తో సినిమా రిలీజ్ అయింది. ఇక డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ మూవీ మొదటి రోజు ఏకంగా 56 కోట్లు రాబట్టింది.. రెండో రోజు కూడా ‘డాకు మహారాజ్’ అదే జోరు కోనసాగించింది. ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద రూ. 13. 50 కోట్ల వసూల్లు చేసింది. ఇక ఈ రెండు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ రూ. 38.85 కోట్లు వసుళ్లు చేయగా, వర్డల్ వైడ్ గా రూ. 76 కోట్ల వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది.. మొత్తానికి ఈ మూవీతో బాలయ్య మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇకపోతే బాలయ్య సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో మరోసారి అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం తీసుకురానున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందట.. ఆ మూవీని కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రాబోతుందని టాక్..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×