Satyabhama Today Episode January 14th : నిన్నటి ఎపిసోడ్ లో… సత్య జయమ్మని ఒక ప్లాన్ అడుగుతుంది భైరవికి ఎలాగైనా తిక్క కుదుర్చాలి నా దారిలోకి తెచ్చుకోవాలని ఏదైనా ప్లాన్ చెప్పమని సలహా అడుగుతుంది. జయమ్మ సత్య ఇద్దరు కలిసి భైరవిలో భయాన్ని కలిగిస్తారు. ముందుగా బైరవికి పాలు విరిగిపోతే అపశకనమని జయం అంటుంది. ఇక నెత్తి పైన బల్లి పడితే మహా పాపమని జయమ్మ సత్య ఇద్దరు బైరవి లో ఆందోళన కలిగిస్తారు. తాలిగండం మావయ్య గారికి ఏమవుతుందని సత్య ఇంకా సత్య భయపెడుతుంది. దానికి జయమ్మ బల్లి నెత్తిన పడితే బల్లి శాస్త్రం ప్రకారం ఏదో ఒక పరిహారం ఉంటుంది వెంటనే మనము పంతుల్ని పిలిచి ఆ పరిహారం ఏంటో కనుక్కుందామని అంటుంది. సత్య బల్లి ప్లాన్ క్రిష్ బయట నుంచి చూస్తాడు. నిజంగానే బల్లి పడిందని సత్యని అడుగుతాడు. అవును నిజంగానే పడింది నీకెందుకు అనుమానం వచ్చింది అని సత్య అడుగుతుంది. అదేం లేదు నేను ఒక బల్లిని చూసాను చాలా బాగుంది అని కొనుక్కొని వచ్చాను అని క్రిష్ కావాలనే సత్యకు హింట్ ఇస్తాడు. క్రిష్ కు ప్లాన్ ఎక్కడా తెలిసిపోయిందో అని భయపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ సత్యను అనుమానంగా చూస్తాడు. ఏంటి అలా అనుమానంగా చూస్తున్నాడు. కొంపతీసి నా ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందని సత్య టెన్షన్ పడుతుంది. అప్పుడే పంతులు వస్తాడు. బల్లి శాస్త్రం ప్రకారం మృత్యుంజయ హోమం చేస్తే చాలా మంచిది అని పంతులు చెప్తాడు. మహదేవయ్యను టెన్షన్ పెడుతుంది భైరవి.. అయ్యో పెనిమిటి నాకు తాలికొండమ్మ మీరు లేకుండా నేను అసలు ఊహించుకోలేను అనేసి ఏదేదో అంటుంది దానికి కోపంతో మహదేవ ఆ మృత్యుంజయ హోమం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక అంతే కాదమ్మా ఇందులో ఒక చిక్కు ఉందని పంతులు చెప్తాడు.. అదేంటి పంతులుగారు ఇంకా ఏదైనా సమస్య ఉందా అని భైరవి అడుగుతుంది. సమస్య కాదమ్మా ఈ హోమం తర్వాత మీరు ఇంట్లోని ఆడవాళ్ళ కోరికలు తీర్చాలని అంటాడు. అదేం పెద్ద భాగ్యం కాదు అలానే పంతులుగారు మీరు ముందు హోమం చేయించండి ఈ బల్లి గురించి నాకు టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా ముందు తొలగిపోతే చాలు వాళ్ళ కోరికల్ని తీరుస్తానని భైరవి భరోసా ఇస్తుంది. ఇక భైరవి మహదేవయ్యను ఒప్పించి హోమాన్ని పూర్తి చేస్తుంది. ఇక హోమం సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత పంతులు చెప్పినట్లు అందరు కోరికలు తీర్చాలని భైరవి అనుకుంటుంది.
ఇక భైరవి ఒక్కొక్కరిని కోరికలు అడుగుతుంది. అత్తయ్య మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతుంది ఆమె నాకు ఒక రామాయణం బుక్కు కావాలని అంటుంది. అలాగే రేణుకకు ఏం కావాలో కావాలో కోరుకోమంది. రేణుక నాకు ఒక పట్టు చీర కావాలని అడుగుతుంది. సరే నీకు ఎటువంటి పట్టు చీర కావాలంటే అటువంటి పట్టుచీర తీసుకోపో అని భైరవి రేణుక కోరికను తీరుస్తుంది. ఇక సత్య అడిగితే నాకు నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి ఒక మనిషి కావాలి మీరు ఆ సంతకం పెడతారా అత్తయ్య అని అడుగుతుంది. అనుకున్న కోరిక తీరకుంటే శాపం పెరుగుతుందని పంతులు చెప్పడంతో భైరవి భయపడిపోతుంది. సత్య కోరికను తీరుస్తానని ఒప్పుకుంటుంది సంతకం మాత్రమే నీకు నా ఓటు మాత్రం నీకే పెనిమిటి అని మహదేవయ్యతో అంటుంది.. ఇక సంజయ్ సంధ్య కు కాల్ చేస్తాడు. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావ్ అంటే మనిద్దరి మధ్య దూరం పెరిగేలా ఉంది సంజయ్ మా అక్కకు ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అని అనగానే నువ్వేం టెన్షన్ పడకు ఆఖరి నిమిషంలో నువ్వు హ్యాండ్ చెయ్యి ఆ తర్వాత మీ అక్కకు ఇంకొక మనిషి తగ్గుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమన్నా నేనున్నాను కదా చూసుకోవడానికి అని ఏదో ఒకటి చెప్పేస్తాడు. ఇక సత్య అటు చక్రవర్తిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది.. మీరు నాకు గనక సంతకం చేయకపోతే మీరే కృషి అసలు తండని చెప్తానని అంటుంది దానికి చక్రవర్తి నేను సంతకం చేస్తానని అంటాడు.
అప్పుడే మహదేవయ్య చక్రవర్తికి ఫోన్ చేసి నువ్వు సత్యకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు కదా నీ కొడుకుని కోడల్ని డైరెక్ట్ గా పైకి పంపిస్తానని అంటాడు.. ఇక మొత్తానికి సత్య ప్లాను అనుకున్నట్టుగా పూర్తవుతుంది సంతకం చేయడానికి పది మంది దొరికేసినట్టే అని క్రిష్ మనసులో సంతోషపడతాడు. సంపంగి చాలా సంతోషంగా ఉంది కదా ఈరోజు ఎలాగైనా నా సంపంగి నేను బాగా ఎంజాయ్ చేయాలని క్రిష్ అనుకుంటాడు. అని సత్య వచ్చి క్రిష్ కు పెద్ద షాక్ ఇస్తుంది ఈ సంతోషమంతా నాది కదా నేను కష్టపడ్డాను కదా అయితే ఒక్కడినే ఎంజాయ్ చేయాలి నేను ఎలక్షన్స్ లో పోటీ చేసేంతవరకు నాకు అందరూ సాయం చేసే అంతవరకు మన మధ్య ఈ దూరం ఉండాలి అని అంటుంది దాంతో కృషి షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి అందరూ వెళ్తారు కానీ సంధ్య హాండ్ ఇస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..