BigTV English

Viral Video: వీడెవడో ‘మర్యాద రామన్న’ తమ్ముడిలా ఉన్నాడే.. ఇప్పుడా బోండాం నీళ్లు తాగేదెలా రా అబ్బాయ్?

Viral Video: వీడెవడో ‘మర్యాద రామన్న’ తమ్ముడిలా ఉన్నాడే.. ఇప్పుడా బోండాం నీళ్లు తాగేదెలా రా అబ్బాయ్?

దేశంలో నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. రైల్వే ప్రయాణాల్లో ఎన్నో వింత వింత ఘటనలు జరుగుతుంటాయి. తరచుగా పలు సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పటికే రీల్ లైఫ్ లో జరిగిన ఓ ఘటన.. ఇప్పుడు రియల్ లైఫ్ లో జరగడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


నవ్వులు పంచిన సునీల్ కొబ్బరి బోండాం సీన్!

‘మర్యాద రామన్న’ సినిమాను చూసే ఉంటాం. ఈ సినిమాలో ట్రైన్ సీన్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. హీరో సునీల్, హీరోయిన్ సలోనీ మధ్య సన్నిశాలు ఆకట్టుకుంటాయి. ఆద్యంతం నవ్వులతో అలరిస్తాయి. ఇక ఈ ట్రైన్ సీన్ లో హైలెట్ కొబ్బరి బోండాం. రైలు ప్రయాణంలో భాగంగా ఓ స్టేషన్ లో ట్రైన్ ఆగుతుంది. అక్కడ చిరు వ్యాపారుల నుంచి ప్రయాణీకులు ఎవరికి కావాల్సిన స్నాక్స్ వాళ్లు కొనుక్కుంటారు. సునీల్ మాత్రం కొబ్బరి బోండాం తీసుకుంటాడు. స్ట్రా ఇస్తే, తీసుకోవడానికి ఇష్టపడడు. వాడి పడేసిన స్ట్రాలను మళ్లీ ఉపయోగిస్తారంటూ వద్దని చెప్తాడు. తీరా రైలు కదిలాక, కొబ్బరి బోండాం లోపలికి రాకపోవడంతో షాక్ అవుతాడు. దాన్ని చూసి మిగతావాళ్లంతా నవ్వుతారు. ఈ సీన్ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.


రియల్ లైఫ్ లో ‘మర్యాద రామన్న’ సీన్ రిపీట్

ఇక ‘మర్యాద రామన్న’ సినిమాలో కొబ్బరి బోండాం సీన్ తాజాగా రియల్ లైఫ్ లోనూ జరిగింది. ఓ కుర్రాడు రైల్వే స్టేషన్ లో కొబ్బరి బోండాం కొనుగోలు చేశాడు. అచ్చం సినిమాలో మాదిరిగానే కిటీకి బయట నుంచి కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి ఆ యువకుడికి అందిస్తాడు. ట్రైన్ కదిలాక, అసలు విషయం గుర్తుకు వస్తుంది. ఆ బోండాంను లోపలికి తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అచ్చం ‘మర్యాద రామన్న’ సినిమా సీన్ ను తలపించే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.

Read Also: స్టవ్ మీద కూర పెట్టి నిద్రపోయారు.. గాల్లో కలిసిపోయిన ప్రాణాలు!

నిజంగా జరిగిందా? కావాలని చేశారా?

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది సునీల్ తమ్మడు అంటూ కామెంట్ చేస్తుండగా, మరికొంత మంది స్క్రిప్ట్ ప్రకారమే ఈ వీడియో షూట్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా కొబ్బరి బోండాం కొనుగోలు చేస్తే, దానిలోని నీళ్లు తాగేలా కత్తితో కట్ చేసి ఇవ్వాలి కానీ, కొబ్బరి బోండాంను కొట్టకుండా ఎలా ఇచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. కేవలం వైరల్ అయ్యేందుకు చేసిన జిమ్మిక్కు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆయన ఈ కొబ్బరి నీళ్లను తాగడం కలే అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ రియల్ లైఫ్ ‘మర్యాద రామన్న’ సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read Also: ఇదెక్కడి దొంగతనం రా బాబూ.. రైల్వే స్టేషన్ లో యువకుడికి ఊహించని షాక్!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×