E-Paper
Advertisement

Daarkaari #MM 2 Movie: పీపుల్స్ మీడియా మరో ప్రయత్నం.. చైతు జొన్నలగడ్డ, రవి ఆంథోని కొత్త చిత్రం ‘దార్కారి MM పార్ట్ 2’ లుక్‌ రిలీజ్

Daarkaari #MM 2 Movie: పీపుల్స్ మీడియా మరో ప్రయత్నం.. చైతు జొన్నలగడ్డ, రవి ఆంథోని కొత్త చిత్రం ‘దార్కారి MM పార్ట్ 2’ లుక్‌ రిలీజ్
Advertisement

Daarkaari #MM 2 Movie: టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డిఫరెంట్ కంటెంట్‌లతో వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తన ముద్ర వేస్తోంది. కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నిర్మాణ సంస్థ నుంచి త్వరలో అంటే మరో రెండు రోజుల్లో మిస్టర్ బచ్చన్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో క్రేజీ చిత్రానికి సంబంధించి ఇచ్చిన అప్డేట్‌‌తో అందరినీ ఆకట్టుకుంది.

టిల్లు స్క్వేర్ సినిమాకు రైటర్‌గా, అలాగే మ్యాడ్ చిత్రంలో అద్భుతమైన రోల్ చేసి ఎంతగానో సినీ ప్రియుల్ని అలరించిన రవి ఆంథోని ఇప్పుడు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. రవి ఆంథోని దర్శకుడిగా కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ సోదరుడు అయిన చైతు జొన్నలగడ్డ ఇప్పటికి చాలా సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల వచ్చిన బబుల్ గమ్ సినిమాలో కూడా అద్భుతమైన నటనతో చైతు జొన్నలగడ్డ అందరినీ మెప్పించాడు.

Advertisement

Also Read: దేవర మూవీ ఆయుధ పూజ సాంగ్ హైప్ క్రియేట్ చేయడం పక్కానా..!

ఇలా వరుస సినిమాలతో చైతు దూసుకుపోతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. తన తమ్ముడు సిద్దు బాటలోనే చైతు పయనిస్తున్నాడు. ఇలా నటనలో తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకున్న చైతు జొన్నలగడ్డ ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే, మాటల్ని కూడా అందించేందుకు రెడీ అయ్యాడు. రవి ఆంథోని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక కొత్త చిత్రానికి చైతు జొన్నలగడ్డ రైటింగ్‌ సమకూరుస్తున్నాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో రాబోతోన్న ఆ కొత్త సినిమానే ‘దార్కారి MM పార్ట్ 2’. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ ట్రీట్ మేకర్స్ అందించారు. ఇది పాన్ ఇండియా సినిమా కాదని.. పాన్ మసాలా సినిమా అంటూ ఓ ప్రీలుక్ వదిలారు. ఈ ప్రీ లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హీరో ఎవరు? అనేది రివీల్ చేయకుండా.. డిజైన్ చేసిన పోస్టర్ అందరిలోనూ క్యురియాసిటీ క్రియేట్ చేసింది. అందులో హీరో గోల్డ్ మెన్‌గా ఫుల్ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ధార్కారి MM పార్ట్ 2’ అంటూ ఈ పోస్టర్ మీద కనిపిస్తుండటం.. అసలు పార్ట్ వన్ అనేది లేకుండా.. ఇలా రెండో పార్ట్‌ను ప్రకటించడంతొ.. అందరిలోనూ ఆసక్తిని పెంచేసినట్టు అయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×