Child Car Accident Video: ఇటీవల చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రులు ఏమరపాటుగా ఉండడంతో పిల్లలు ఆడుకోవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నా కూడా తల్లిదండ్రులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. తమ మాటల్లో బిజీబిజీగా ఉండడంతో బాలుడు ఒక్కసారిగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో యూపీలోని ఆగ్రాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ అమాయకపు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక సంఘటన కెమెరాలో రికార్డ్ అయింది.
ఒకటిన్నర సంవత్సరాల బాలుడు మాల్ లో కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. షాపింగ్ కోసం వెళ్లిన తల్లిదండ్రులు షాపింగ్ అనంతరం పార్కింగ్ స్థలంలో ముచ్చట్లు పెడుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో తమ చిన్నారి ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్నే మర్చిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి మరొక బాలుడితో ఆడుకుంటూ కారు వైపు వెళ్లింది. ఈ తరుణంలో వేరే వ్యక్తి కారును తీసి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో మొదటగా కారును వెనక్కి తీసుకెళ్లాడు. అనంతరం ఆ కారు ముందుకే బాలుడు పరుగులు తీశాడు. దీంతో బాలుడిని చూసుకోని డ్రైవర్ అమాంతం ఆ బాలుడిపైకే కారును ఎక్కించాడు.
ఈ క్రమంలో కారు టైరు కింద పడిపోయిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు కేకలు పెట్టడంతో అది గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా కారును వెంటనే ఆపేసి దిగి చూశాడు. ఇంతలోనే బాలుడి తల్లి కొడుకు ఏడుపు విని పరుగులు తీసి ఎత్తుకుని వచ్చింది. దీంతో అదే కారులో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
A car ran over a one-and-a-half-year-old girl in the parking lot of a mall in Agra. The CCTV video of the accident on August 6 has gone viral.#AccidentsFatal #CCTVFootage pic.twitter.com/TWHwwbAaV4
— Sanjay Insights (@SanjayInsights) August 11, 2024