Daksha Nagarkar: ఏకే రావు పీకే రావు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ దక్ష నగార్కర్. హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఆ సినిమా సమయంలోనే చైతూ, దక్ష మధ్యలో ఏదో నడుస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి. బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వాళ్లిద్దరూ సైగలతో మాట్లాడుకోవడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా చైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది దక్ష. చైతూ లాంటి అబ్బాయిని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుందని చెప్పుకొచ్చింది.
‘‘చైతూ చాలా స్వీట్ పర్సన్. అతని లాంటి అబ్బాయిని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తాడు. బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో నన్ను హగ్ చేసుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వచ్చి నాకు సారీ చెప్పాడు. అంత స్వీట్ పర్సన్’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మళ్లీ వారి మధ్యలో ఏదో నడుస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.