BigTV English

Pawan Kalyan : ఢిల్లీలో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?

Pawan Kalyan : ఢిల్లీలో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?

Pawan Kalyan : జనసేనాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ పెద్దలతో వరుసగా భేటీలు అవుతున్నారు. సోమవారం హస్తినలో కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్ తో సమావేశమైయ్యారు. మంగళవారం కూడా మరోసారి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మురళీధరన్ తో భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. మురళీధరన్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది.


ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై మురళీధరన్, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం, భవిష్యత్‌ కార్యాచరణపై ఇరువురు నేతలు సమాలోచనలు చేసినట్లు సమాచారం. జనసేనానితోపాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు.

జనసేనానికి ఏపీ బీజేపీ నేతలకు మధ్య గ్యాప్ ఉంది. కొంత మంది కాషాయ నేతలు జనసేనతోనే కలిసి పోటీ చేస్తామంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి నేతలు జనసేన.. బీజేపీకి సహకరించడం లేదని బహిరంగంగానే విమర్శించారు. ఈ రెండు పార్టీ కలిసి కార్యక్రమాలు చేపట్టన సందర్భాలు లేవు. పేరుకు మిత్రులుగా ఉన్నారు గానీ ఉమ్మడిగా ముందుకు వెళ్లడంలేదు.


టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ ఆలోచిస్తున్నారని ఇటీవల చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒంటరిగా పోటీకి దిగితే వీరమరణం తప్పదని ఇప్పటికే పవన్ స్పష్టం చేశారు. తమ గౌరవానికి తగ్గకుండా సీట్లు ఇస్తే కలిసి పోటీ చేసేందుకు సిద్ధమని తేల్చిచెప్పేశారు. ఏడాది వ్యవధిలోనే చంద్రబాబుతో పవన్ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయ్యారు. పొత్తులపై పూర్తి కార్లిటీ ఇవ్వకపోయినా… కలిసే వెళతామనే సంకేతాలు బలంగా పంపించారు.

బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేది లేదంటోంది. దీంతో చంద్రబాబుకు బీజేపీకి మధ్యలో జనసేనాని ఉన్నారు. మరి మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిర్చే బాధ్యత పవన్ తీసుకుంటారా..? ఆ దిశగా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తారా..? ఢిల్లీ పర్యటనతో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? జనసేనాని దారెటు..?

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×