E-Paper
Advertisement

Suriya 44: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ..

Suriya 44: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ..
Advertisement

Suriya 44: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమాతో బిజీగా ఉన్న సూర్య.. ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అదే Suriya44. 2D ఎంటర్ టైన్మెంట్స్ మరియు స్టోన్ బెంచర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక రెండు రోజుల నుంచి కార్తీక్ సుబ్బరాజ్.. తన సినిమాలోని క్యాస్ట్ అండ్ క్రూ ను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను పరిచయం చేశాడు. ఈ చిత్రంలో సూర్య సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుందని కార్తీక్ అధికారికంగా తెలిపాడు.

Advertisement

ఇక ఇది పూజకు లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. గత రెండేళ్లుగా పూజా వరుస ప్లాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా.. ఇప్పుడు ఐరెన్ లెగ్ అని అనిపించుకుంటుంది. ఈ ఏడాదిలో అమ్మడు కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించింది లేదు. ఇక తెలుగు లో కాకుండా అమ్మడు తమిళ్ లో ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేయడం సూపర్ ఛాయిస్ అని చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్- సూర్య కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

పాన్ ఇండియా సినిమాగా Suriya44 తెరకెక్కుతుంది. ఇందులో పూజా ఛాన్స్ పట్టేసింది అంటే .. అమ్మడుకు మళ్లీ విజయం దక్కే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. లవ్ లాఫర్ వార్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ప్రేమ, కామెడీ, యుద్ధం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పూజాతో పాటు విలక్షణ నటుడు జయరాం కూడా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో పూజా బ్యాక్ టూ గోల్డెన్ లెగ్ లిస్ట్ లోకి వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×