E-Paper
Advertisement

Maname Movie: 16 పాటలా.. సినిమాలో సాంగ్స్ ఉంటాయా.. సాంగ్స్ లో సినిమా ఉంటుందా

Maname Movie: 16 పాటలా.. సినిమాలో సాంగ్స్ ఉంటాయా.. సాంగ్స్ లో సినిమా ఉంటుందా
Advertisement

Maname Movie: యంగ్ హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మనమే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఒక షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో టోటల్ గా 16 సాంగ్స్ ఉంటాయని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ కాలంలో 6 సాంగ్స్ వినడానికే అభిమానులు వామ్మో అంటున్నారు. అది కూడా ఆ సాంగ్ వినగలిగేవిగా ఉంటే మాత్రమే. అలాంటింది 16 సాంగ్స్ అంటే మాటలు కాదు.

Advertisement

“మనమే సినిమా ఓ సంగీత మహోత్సవం. సినిమాను సంగీతమే నడిపిస్తుంది. మనమే సినిమాలో మొత్తం 16 పాటలు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ ఈ సినిమాకు ఆత్మ. నా కెరీర్‌లో తొలిసారి రీరికార్డింగ్‌ కే ఎక్కువ సమయం కేటాయించాను అంటే అది మనమే సినిమాకు మాత్రమే. నేనేం అడిగినా దానిని హేషమ్ అందించాడు. అతనికి ఓపిక ఎక్కువ. మనమే.. హేషమ్ అబ్దుల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు విన్న అభిమానులు.. షాక్ అవుతున్నారు. 16 పాటలా.. సినిమాలో సాంగ్స్ ఉంటాయా.. సాంగ్స్ లో సినిమా ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా శర్వాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×