E-Paper
Advertisement

Deadpool Wolverine Collection: బాక్సాఫీసును షేక్ చేస్తున్న కొత్త సినిమా.. మూడు రోజుల్లో రూ.3650 కోట్ల కలెక్షన్స్..!

Deadpool Wolverine Collection: బాక్సాఫీసును షేక్ చేస్తున్న కొత్త సినిమా.. మూడు రోజుల్లో రూ.3650 కోట్ల కలెక్షన్స్..!
Advertisement

Deadpool Wolverine Collection: ఇండియన్ సినీ ప్రియుల్లో హాలీవుడ్ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందులోనూ హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ అంటే మహా పిచ్చనే చెప్పాలి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ఎంతోమంది భారతీయ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో సినిమా వచ్చి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది. అదే ‘డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్’ మూవీ.

గతంలో వచ్చిన డెడ్‌పూల్, డెడ్‌పూల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. షాన్‌ లేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దాదాపు ఈ సినిమా రూ.200 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్ మన్ హీరోలుగా నటించి అదరగొట్టేశారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.3,650 కోట్ల వసూల్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

Also Read: దేవ‌ర నుంచి మరో లీక్.. ఎన్టీఆర్ లుక్ వేరే లెవెల్ ఉంది మచ్చా

దీంతో ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల జాబితాలో 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఇండియాలోనూ ‘డెడ్‌పూల్ అండ్ వాల్వ‌రిన్’ మూవీ దుమ్ము దులిపేస్తుంది. మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ.66 కోట్ల కలెక్షన్లు రాబట్టి అదరగొట్టేసింది. మొదటి రోజు ఇండియాలో రూ.21 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. శని, ఆదివారాల్లో దాదాపు రూ.45 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమాపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

థియేటర్లలో పెద్ద సినిమాలేవి లేకపోయేసరికి ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. దీంతో ఈ మూవీ ఇప్పుడు చిత్ర నిర్మాతలకు రెండింతలు లాభాలు తెచ్చిపెట్టింది. కాగా ఈ మూవీలో రయాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. అలాగే చిన్నగా కామెడీ టచ్ ఇచ్చిన విధానం కూడా బాగా ఆకట్టుకుంది. ఇలా యాక్షన్, కామెడీ సన్నివేశాలతో ‘డెడ్‌పూల్ అండ్ వాల్వ‌రిన్’ మూవీ థియేటర్లలో అదరగొట్టేస్తుంది. మరి మీరు కూడా ఇంకా ఈ సినిమా చూసుండకపోతే వెంటనే పరుగులు పెట్టండి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×