BigTV English

BRS Party Burden On KTR: కేటీఆర్ పైనే భారం చేతులెత్తేసిన కేసీఆర్?

BRS Party Burden On KTR: కేటీఆర్ పైనే భారం చేతులెత్తేసిన కేసీఆర్?

తెలంగాణలో కాళేశ్వరం కేంద్రంగా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీల మధ్య వాటర్ వార్ హైవోల్టేజ్‌కి చేరుకుంది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డతో కాళేశ్వరం పంచాయితీ కాక రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలన్నారు. ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని,  స్పందించకుంటే కేసీఆర్‌ నాయకత్వంలో 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు కేటీఆర్.  కుంగుబాటు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. రాబోయే రోజుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని కామెంట్ చేశారాయన.
తమ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతల ఘోర తప్పిదమని.. ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరంపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు.
ఇక మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బీఆర్‌ఎస్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్‌‌నేనని..  కేటీఆర్‌ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. అయినా పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తీసిపారేశారు. కాళేశ్వరం పేరుతో రెండు లక్షల కోట్ల రూపాయలు గంగపాలు చేశారని ఆ డబ్బులతో వేలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టేవాళ్లం అని పేర్కొన్నారు.
ఆధారాలతో సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ సతమతమవుతుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా వారికి తోడైంది. బీఆర్ఎస్ హయంలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శించారు. వాళ్ల దృష్టి మొత్తం గచ్చిబౌలి వైపే ఉందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీలో దుర్భర పరిస్థితులు ఉన్నా పట్టించుకున్న నాదుడే గత పదేళ్లలో లేడని. కేటీఆర్‌ను అడిగితే ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారనిఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలు అద్భుతంగా చెప్పేవారు కానీ.. పనులు మాత్రం శూన్యమని సెటైర్లు విసిరారు.
కాంగ్రెస్ నేతలకే కేటీఆర్ పళ్లబిగువున సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పవర్‌లో ఉన్నప్పుడు పాతబస్తీపై బోల్డు ప్రేమ ఒలకపోసిన ఆయన ఇప్పుడు అక్బర్ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ ఒంటరి అయిపోయిటన్లే కనిపిస్తోందిప్పుడు.


Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×