Ntr New Look Leaked From Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో యావత్ ప్రపంచ సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. దీనిని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ మూవీలో తీర ప్రాంత ప్రజల సమస్యల కోసం పోరాడే ఒక పవర్‌పుల్ నాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే ఇందులో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయనతో పాటు మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ కూడా ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫియర్ సాంగ్ సినిమా రేంజ్‌ను అమాంతంగా పెంచేశాయి.
Also Read: ‘దేవర’ మూవీ నుంచి సాంగ్ అప్డేట్..క్లూ ఇచ్చిన శేఖర్ మాస్టర్!
ముఖ్యంగా ఫియర్ సాంగ్‌కు యూట్యూబ్‌లో యాభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చి అదరగొట్టేశాయి. అలా అంచనాలు పెరిగిపోవడంతో ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అందులో లీక్‌ల గోల ప్రధాన సమస్యగా మారింది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి లీక్‌లు బయటకు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వస్తున్న వీడియో ఒకటి లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఇప్పుడు మరో లీక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ లీక్ ప్రకారం.. ఎన్టీఆర్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. గుబురు గుబురు గడ్డం, మెలితిరిగిన కండలతో బ్లాక్ షర్ట్ వేసుకుని కొత్తగా కనిపిస్తున్నాడు. ఇంతక ముందు దేవర టీం రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ ఫొటోతో పోలిస్తే ఇందులో కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.
Vara gadi mass 🔥🔥🔥🔥
Dinakka talk tho sambandam lekundha AP /TG kutta chimpi para dengutham rasi pettukondi 🔥#devara @tarak9999 pic.twitter.com/ykL4q4GubK— hareesh (@Sai_NTR_K) July 28, 2024