BigTV English

Deepika Padukone: దీపికా పదుకొనే ఏడాది సంపాదన అన్ని కోట్లా..?

Deepika Padukone: దీపికా పదుకొనే ఏడాది సంపాదన అన్ని కోట్లా..?
Deepika Padukone latest news

Deepika Padukone latest news(Bollywood celebrity news):


సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. నటీనటుల సినిమా, వ్యక్తిగత విషయాలతో పాటు వారి కెరీర్‌కి సంబంధించిన మరిన్ని అంశాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఒక్కోసారి వారి ఏడాది సంపాదన చూసి షాక్ అవుతుంటారు. తాజాగా అలాంటిదే ఓ హీరోయిన్‌కి సంబంధించిన వార్త బయటకొచ్చింది. అందం, నటన, యాక్షన్ ఫైట్లతో పలు భాషల ఆడియన్స్‌ను ఆమె ఆకట్టుకుంటుంది. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌తో సహా హాలీవుడ్‌లోనూ మంచి పేరు సంపాదించుకుంది.

నేడు ఈ అందాల భామ 38వ బర్త్ డే జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఒకటి ఆమె ఏడాది సంపాదన. తాజా సమాచారం ప్రకారం.. దీపికా పదుకొనే ఏడాది సంపాదన తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు కమర్షియల్ యాడ్లలో నటిస్తూ భారీగానే సంపాదిస్తుంది దీపికా.


సినిమాలు, కమర్షియల్ యాడ్‌లతో సహా పలు రకాల బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఈమె ఏడాది సంపాదన దాదాపుగా రూ.60 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక నటి ఏడాదికి ఇంత సంపాదిస్తుందా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. కాగా దీపికా ప్రతి సినిమాకి రూ .13 నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుందని టాక్. అలాగే ఎండార్స్మెంట్‌కి రూ.7నుంచి రూ .10కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన ఈ ముద్దుగుమ్మ వీటి నుంచి కూడా భారీగానే సంపాదిస్తోందట. ఏదేమైనా ఈ అమ్మడు బాగానే సంపాదిస్తుందని అంతా అనుకుంటున్నారు.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×