BigTV English

Germany Carbon : 70 ఏళ్ల కనిష్ఠానికి జర్మనీ కాలుష్యం

Germany Carbon : 70 ఏళ్ల కనిష్ఠానికి జర్మనీ కాలుష్యం
Germany Carbon

Germany Carbon : జర్మనీలో కర్బన ఉద్గారాల విడుదల 70 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జర్మనీ.. గ్రీన్ హౌజ్ వాయువుల కట్టడికి పలు చర్యలు తీసుకుంది. 2023లో 673 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర కార్భన్-డై-ఆక్సైడ్ వాయువులు వెలువడ్డాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 73 మిలియన్ మెట్రిక్ టన్నులు తక్కువ.


బొగ్గు ఆధారిత విద్యుత్తును వాడకాన్ని గణనీయంగా తగ్గించడమే దీనికి కారణమని జర్మన్ మేధోమథన సంస్థ అగోరా ఎనర్గీవెండా వెల్లడించింది. దీని వల్ల 44 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర కార్బన్-డై-ఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గాయి. పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలూ నిరుడు బాగా తగ్గాయి. రెన్యువబుల్ ఎనర్జీ వినియోగం పెరగడంతో కార్బన్-డై-ఆక్సైడ్‌కు చెక్ చెప్పినట్టయింది.

జర్మనీలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 55% పునరుత్పాదక వనరుల నుంచి లభించిందే. 2022లో రెన్యువబుల్ ఎనర్జీ 48 శాతంగా ఉంది. 2045 నాటికి కార్బన్ జీరో సాధించాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా నిరుడు జర్మనీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.


ఆయిల్, గ్యాస్ హీటింగ్ వ్యవస్థలకు చెల్లుచీటీ ఇచ్చే దిశగా పార్లమెంట్ ఓ బిల్లును ఆమోదించింది. దాని వల్ల 2030 నాటికి 40 మిలియన్ టన్నుల కర్బన వాయువులను అరికట్టే వీలుంది. నిరుడే మూడు న్యూక్లియర్ ప్లాంట్లను కూడా మూసేసింది. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సౌర, పవన విద్యుదుత్పత్తిని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×