Big Stories

Deepika padukone : కాంట్ర‌వ‌ర్శీల్లో ప‌ఠాన్‌… ఈ సారి టార్గెట్ దీపిక‌

Deepika padukone controversi

బేష‌ర‌మ్ రంగ్ రో… అని ఎందుకు రాశారు? ఇప్పుడు ప‌ఠాన్ సినిమా చుట్టూ అల్లుకున్న కాంట్ర‌వ‌ర్శీలో ఫ‌స్ట్ క్వ‌శ్చ‌న్ ఇదే. కుంకుమ పువ్వును బేష‌ర‌మ్‌గా వ‌ర్ణించ‌డం మీద తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

- Advertisement -

ఈ పాట‌లోని ప‌దాల‌ను స‌రిదిద్దే దాకా సినిమా విడుద‌ల‌ను ఆపాలంటూ స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌కు వినీత్ జిందాల్ అనే న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. షారుఖ్‌ఖాన్‌, దీపిక ప‌దుకోన్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ప‌ఠాన్‌. చాన్నాళ్లుగా రిలీజుల‌కోసం వెయిట్ చేస్తున్న షారుఖ్‌ఖాన్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఇటీవ‌ల బేష‌ర‌మ్ పాట విడుద‌లైంది. రిలీజ్ అయిన సెక‌ను నుంచే మంచి స్పంద‌న వ‌స్తోంది.

- Advertisement -

షారుఖ్‌, దీపిక కెమిస్ట్రీ గురించి కూడా అంద‌రూ స్పెష‌ల్‌గా మాట్లాడారు. పాట‌లో దీపిక బికినీ గురించి హాట్‌నెస్ గురించి కుర్ర‌కారు తెగ మెచ్చుకుంటున్నారు. కానీ దీపిక బికినీ రంగు కాషాయంలో ఉండ‌టం గురించి కూడా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని, ఇలా అవ‌మానించ‌డం త‌గ‌ద‌ని కూడా వినీత్ చేసిన ఫిర్యాదులో ఉంది. ఈ పాట గురించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోమ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా కూడా త‌ప్పుబ‌ట్టారు. జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది ప‌ఠాన్‌. హిందీతో పాటు త‌మిళ్‌, తెలుగులోనూ ఈ పాట‌ను విడుద‌ల చేశారు. అయితే రీజిన‌ల్ లాంగ్వేజ్ క‌న్నా హిందీలోనే ఎక్కువ‌గా ప్ర‌చారంలో ఉంది ఈ సాంగ్‌.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News