కొందరి నోటి వెంట కొంతమంది పేర్లు వింటుంటే అదో రకం కిక్కు. లేటెస్ట్ గా అలీ నోటెంట పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పేరు విన్నట్టు. అలీతో సరదాగా ఈ సీజన్ పూర్తి కావచ్చింది. ఆఖరి ఎపిసోడ్‌లో అలీని సుమ ఇంటర్వ్యూ చేశారు. ఆసక్తికరమైన చాలా విషయాలనే పంచుకున్నారు అలీ.
ఆయన చెప్పిన వాటిలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మంచు లక్ష్మి గురించి. మంచు లక్ష్మి హ్యాండ్ మంచిదని అన్నారు అలీ. ఆమె బోణీ చేసిన ఈ సీజన్ అద్భుతంగా కొనసాగిందని, నిరంతరాయంగా కంటిన్యూ అయిందని చెప్పారు స్టార్ కమెడియన్. ఆల్రెడీ ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్‌గా మంచు లక్ష్మికి మంచి పేరుంది. ఇప్పుడు అలీ కూడా అదే విషయాన్ని చెప్పడంతో, ఆల్రెడీ ప్రచారంలో ఉన్న పేరుకు మరింత రిప్యుటేషన్ వచ్చినట్టు అయింది.
సుమకు అలీ ఇంటర్వ్యూ ఇచ్చిన ఎపిసోడ్ కోసం జనాలు మరింత ఈగర్‌గా వెయిట్ చేయడానికి మరో కారణం పవన్ కల్యాణ్. పవర్‌స్టార్ కీ, అలీ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి స్పెషల్‌గా ఎవరూ చెప్పక్కర్లేదు. ఆ రేంజ్ ఫ్రెండ్‌షిప్ వారిది. అలీ లేనిదే పవన్ సినిమాలు లేవనే పేరుండేది. అలాంటిది జబర్దస్త్ ఆర్టిస్టులనైనా ఎంకరేజ్ చేస్తున్నారేగానీ, అలీని తన సినిమాల్లో పెట్టుకోవట్లేదు పవన్ కల్యాణ్. అసలు వారిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనేది ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ చెప్పలేదు. ఫస్ట్ టైమ్ సుమ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడారు అలీ.
మా మధ్య గ్యాప్ రాలేదు. క్రియేట్ చేశారు అని అలీ ఎందుకు అన్నారు? అసలు అలా క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వల్ల లాభపడ్డవారు ఎవరు? వంటివన్నీ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయాలు. అలీ ఏం చెబుతారో, దానికి పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న విషయం.