E-Paper
Advertisement

Pawan Kalyan: ఫ్యాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకోసారి ఓజీ అంటే.. ?

Pawan Kalyan: ఫ్యాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్.. ఇంకోసారి ఓజీ అంటే.. ?
Advertisement

Pawan Kalyan:  అభిమాని లేనిదే హీరోలు లేరులే అనే మాట అక్షరసత్యం.  ఇండస్ట్రీలో అభిమానులు లేని హీరోలు లేరు అంటే అతిశయోక్తి కాదు. కానీ, ఉన్నకొద్దీ అభిమానం పిచ్చిగా మారిపోతుంది. హీరోలు ఎక్కడ.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనేది కూడా ఆలోచించకుండా ఫ్యాన్స్.. కొన్నిసార్లు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు.  అయితే అది వారి అభిమానం అన్నా కూడా.. చూసేవారికి, ఆ హీరోలకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పడంలో  ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరుకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులందూ.. పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే పవన్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అని చెప్పొచ్చు. అయితే ఈ అభిమానం చూపించాల్సిన సమయం అయితే ఇది కాదు.. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కేవలం హీరో మత్రమే కాదు.. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి.

Advertisement

ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌తీస్తాం…రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు.. అభిమానులు కొంతమేర ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారనే చెప్పాలి. పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా.. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు.. ? ఎలాంటి పరిస్థితి ఉంది.. ? అనేది ఆలోచించకుండా.. చాలామంది ఫ్యాన్స్ ఆయన నటించే తదుపరి సినిమా గురించి అప్డేట్ అడుగుతున్నారు. అంతేకాకుండా ఆ సినిమా  టైటిల్ తో అరుస్తూ  విసిగిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అంటిస్తున్న చిత్రాల్లో OG  ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు.

Advertisement

ఇక పవన్ ఎక్కడ కనిపించినా.. OG.. OG.. OG అంటూ  అరుపులు, కేకలు అని అరవడం మొదలుపెట్టారు.  పవన్ అటెండ్ అయ్యింది ఎంత పెద్ద మీటింగ్ అయినా  కూడా అరుపులు ఆగలేదు. ఇప్పటికే రెండు సార్లు పవన్ సైతం.. ఫ్యాన్స్ కు ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పుకొచ్చారు. అయినా ఫ్యాన్స్ లో మార్పు రాలేదు . సినిమా కేవలం సరదా కోసమే అని, త్వరలోనే  OG రిలీజ్ అవుతుందని ఎంతో నిదానంగా చెప్పారు. అసలు సినిమాల గురించి మాట్లాడొద్దని కూడా అన్నారు. అయినా ఫ్యాన్స్ తీరు మారాలేదు.

Allu Ayaan: బన్నీ కొడుకు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. అల్లు అర్జున్ అయితే కాదట

తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పాల్గొన్న పవన్ కు  మరోసారి ఫ్యాన్స్  నుంచి OG నినాదాలు వినిపించాయి. ఇక దీంతో మరోసారి పవన్.. ఫ్యాన్స్ కు సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చారు. ” OG .. OG  అని సినిమాలు కాకుండా ఏదో ఒక భగవంత్ నామం స్మరిస్తే మీకు నిజంగా అద్భుతాలు జరుగుతాయి. సినిమా ఉండాలి.. సరదాకు మాత్రమే. సినిమాలు బావుండాలన్నా.. కడుపు నిండాలన్నా మన కడుపు నిండాలి కదా. డబ్బులు రావాలి కదా” అని అన్నారు.

పవన్ నవ్వుతూ అన్నా కూడా అందులో నిజం చాలా ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమా కేవలం సరదాకు మాత్రమే అని.. అసలు  ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో పవన్ చాలా చక్కగా చెప్పారని అంటున్నారు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ లో మార్పు వస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×