Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నిత్యం రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. గత ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీని సాధించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా(AP Deputy Cm) బాధ్యతలు తీసుకోవడమే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈయన రాజకీయ వ్యవహారాలను చూసుకుంటూ పూర్తిగా బిజీగా ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఏమాత్రం విరామం దొరికిన తాను ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
సెలూన్ ప్రారంభోత్సవం …
ఇలా నిత్యం ఎంతో బిజీగా కడుపుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఒక సెలూన్(Salon) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక్కసారిగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా గడిపే పవన్ కళ్యాణ్ ఇలా సెలూన్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈయనని చూడటం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కానూరు రోడ్డు, అయ్యప్ప నగర్ సమీపంలోని సెలూన్ కొనికిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
టీ షర్ట్, షార్ట్….
ఇకపోతే ఈ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ టీ షర్ట్, షార్ట్ వేసుకొని రావటం విశేషం. సినిమా షూటింగ్ సమయాలలో ఆయన గెటప్ కి తగ్గ లుక్ లో కనిపించే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో ఎప్పుడు వైట్ అండ్ వైట్ దుస్తులలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఈయన టీ షర్ట్, షార్ట్ వేసుకుని ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవ్వడమే కాకుండా, ఇలా టీషర్ట్ షార్ట్ లో ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ పవన్ లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. నిత్యం వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా ఎక్కువ వయసున్న వ్యక్తిగా కనిపించేవారు. ప్రస్తుతం టీ షర్ట్ షార్ట్ వేసుకొని కనిపించడంతో ఈయనలో ఆ గ్లామర్ అలాగే దాగి ఉందని, పర్ఫెక్ట్ హీరో కటౌట్ అంటూ కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈయన టీ షర్ట్ వేసుకోవడంతో పవన్ సరికొత్త ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ఓజీ సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక జూన్ 12వ తేదీ నుంచి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా జూన్ 12వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.