Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) నేపథ్యంలో.. సర్పంచ్ సాబ్ గా పేరుగాంచిన శ్రేయాస్ అయ్యర్ కు ( Shreyas Iyer ) దేశవ్యాప్తంగా పాపులారిటీ లభిస్తోంది. 2024 ఐపిఎల్ టోర్నమెంట్లో… కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లి ఛాంపియన్ గా నిలిపాడు సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్. ఇటు మొన్నటి సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్తగా వచ్చి… ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు శ్రేయాస్ అయ్యర్. అదృష్టం అడ్డం తిరిగింది కానీ… లేకపోతే పంజాబ్ కింగ్స్ కు కూడా టైటిల్ తీసుకువచ్చేవాడు శ్రేయాస్ అయ్యర్. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు ( Punjab Kings) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు భారీగా పాపులారిటీ వస్తుంది.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
శ్రేయస్ అయ్యర్ పై మోజు పడ్డ నటి
పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పై.. ఓ నటి హాట్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ 18 ఫెమ్ అయిన ఎడిన్ రోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రేయాస్ అయ్యర్ ఛాన్స్ ఇస్తే అతన్ని పెళ్లి చేసుకుంటానని… అతనితో కాపురం పెడతానని బాంబు పేల్చింది. తాను శ్రేయస్ అయ్యర్ వలలో పడిపోయాను… అతను అంటే నాకు చాలా ఇష్టం.. అతని కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తా అంటూ హాట్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ 18 ఫేమ్ ఎడిన్ రోజ్.
ఒక్కసారి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అతని ఎదలో వాలిపోతానని కూడా ప్రకటించింది. అంతలా ప్రాణం పెట్టి అతని ప్రేమిస్తున్నానని వివరించారు. అతని కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని కూడా ఎడిన్ రోజ్ ( Bigg Boss 18 Fame Edin Rose ) ప్రకటించారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె కామెంట్స్ విన్న శ్రేయస్ అయ్యర్ అభిమానులు మాత్రం ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు. మా సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ రేంజ్ నీది కాదని… అతని కోసం బడా వ్యాపారస్తులు అమ్మాయిలు కూడా క్యూ కట్టారని కామెంట్స్ పెడుతున్నారు.
టీమిండియా వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు ప్రమోషన్
పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లిన శ్రేయస్ అయ్యార్ కు బంపర్ ఆఫర్ ప్రకటించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ప్రమోట్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారట. 2027 లోపు ఎప్పుడైనా ఈ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.