BigTV English
Advertisement

Akshay Kumar: సినిమా కోసం మారువేషం..ఆ హీరోను చూసి కాపీ కొట్టాడా?

Akshay Kumar: సినిమా కోసం మారువేషం..ఆ హీరోను చూసి కాపీ కొట్టాడా?

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా” హౌస్ ఫుల్ 5″ (House Full 5)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . అక్షయ్ కుమార్(Akshay Kumar) ప్రధాన పాత్రలో కామెడీ ఫ్రాంచైజీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇదివరకు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లను పెట్టడం విశేషం. సాధారణంగా ఒక సినిమాకు ఒకే ముగింపు ఉంటుంది కానీ ఈ సినిమాకు హౌస్ ఫుల్ 5 A, హౌస్ ఫుల్ 5B అంటూ రెండు క్లైమాక్స్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.


రెండు క్లైమాక్స్ లతో..

ఈ సినిమాని 5A స్క్రీన్ పై చూస్తే ఒక క్లైమాక్స్, 5B స్క్రీన్ పై చూస్తే మరొక క్లైమాక్స్ ఉండబోతుందని చిత్ర బృందం ప్రమోషన్లలో భాగంగా తెలియజేశారు. అయితే ఈ సినిమా జూన్ ఆరో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా గురించి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం మీడియా వారు థియేటర్ల వద్ద ఉండటం సర్వసాధారణం అయితే ఈసారి మాత్రం భిన్నంగా నటుడు అక్షయ్ కుమార్ మారువేషంలో థియేటర్ బయట ఉండి ప్రేక్షకుల స్పందనను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆ హీరోని చూసి కాపీ కొట్టారా…

ఈ వీడియోలలో భాగంగా అక్షయ్ కుమార్ తన ఫేస్ కనపడకుండా నల్లటి ఫేస్ మాస్క్ వేసుకొని థియేటర్ బయట మైక్ పట్టుకొని థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులను సినిమా ఎలా ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రేక్షకులు కూడా సినిమా బాగుందని చెబుతూ వెళ్తున్నారే తప్ప అక్కడ ఉన్నది ఎవరనే విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు.. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. వెనుక నుంచి చూస్తే అక్షయ్ కుమార్ ని గుర్తుపట్టొచ్చు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ ఐడియా తన సొంత ఐడియా కాదని కాపీ కొట్టారంటూ కామెంట్ లు చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ కూడా ఇలా మారువేషం వేసుకొని తన సినిమాల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చారని ఎన్టీఆర్ ను చూసి అక్షయ్ కుమార్ ఈ ఐడియా కాపీ కొట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే థియేటర్లలో తమ సినిమాలు విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణ వస్తుందని తెలుసుకోవడం కోసం ఇప్పటివరకు ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇలా మారువేశాలలో థియేటర్ లోపలికి వెళ్లి ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమాలు చూసేవారు. అయితే అక్షయ్ కుమార్ మాత్రం బయట నిలబడి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో పాటు ఇతర భాషా సినిమాలలో కూడా బిజీగా ఉన్నారు. త్వరలోనే మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప (Kannappa Movie)సినిమాలో ఈయన శివుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా జూన్ 27వ తేదీ విడుదల కానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×