BigTV English

Rashmika Mandanna: ఓవర్ యాక్షన్ కాకపోతే.. అంత కుంటుతూ రాకపోతే ఏమైంది.. బాలీవుడ్ అనేగా..?

Rashmika Mandanna: ఓవర్ యాక్షన్ కాకపోతే.. అంత కుంటుతూ రాకపోతే ఏమైంది.. బాలీవుడ్ అనేగా..?

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిన్నది వరుస సినిమాలు చేస్తుంది. ఇక పుష్ప 2 తరువాత అమ్మడు మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న చావా సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. క్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు.


ఛత్రపతి  శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథగా  ఈ సినిమా  తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక  పుష్ప 2 తోనే చావా రిలీజ్ కు రెడీ అయ్యింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. నేడు ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చావా  సినిమాలో రష్మిక మహారాణి యేసుభాయిగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో రష్మికనే హైలైట్ గా మారింది. అందుకు కారణం ఆమె చేసిన ఓవర్ యాక్షన్ అని కొంతమంది చెప్పుకొస్తున్నారు.

కొన్నిరోజుల  క్రితం రష్మిక కాలికి గాయం అయ్యిన విషయం తెల్సిందే. దాని గురించి రష్మికనే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. “జిమ్‌లో నన్ను నేను గాయపరుచుకున్నాను. మరికొన్ని వారాలు, నెలలు లేదా దేవుడికే తెలియాలి ఎన్ని రోజులు నేను గెంతుతూనే ఉండాలి. అలా గెంతుకుంటూ థామా, సికిందర్, కుబేర సెట్స్‌కు వెళ్లిపోతానేమో. ఇలా లేట్ చేస్తున్నందుకు నా దర్శకులందరికీ సారీ. నేను త్వరలోనే నా కాళ్లు యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వస్తాను. లేదా గెంతడానికి సిద్ధంగా ఉన్నా ఓకే. అప్పటివరకు నన్ను చేరుకోవాలంటే నేను ఏదో ఒక మూల గెంతుకుంటూ కనిపిస్తాను. అదే నా వర్కవుట్ ఇంకా” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకున్నారు.


Srikakulam Sherlockholmes: ఏంటి.. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యిందా.. ఇప్పుడు ఓటీటీలో వస్తుందా.. ?

ఇక ఆమె చెప్పినట్లుగానే గెంతుతూనే చావా  ట్రైలర్ ఈవెంట్ కు కూడా అటెండ్ అయ్యింది. నేటి ఉదయం ఎయిర్ పోర్ట్ లో కుంటుతూ .. వీల్ చైర్ లో కనిపించిన రష్మిక.. అలాగే కుంటుతూ ఈవెంట్ లో సందడి చేసింది. డిజైనర్ డ్రెస్ లో కుంటుతూ స్టేజిమీదకు వెళ్ళింది. ఆమెకు విక్కీ కౌశల్ సహాయం చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విదేవులపై నెటిజన్స్ పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు.

కొంతమంది రష్మిక ఎఫర్ట్స్ కు ప్రశంసిస్తుండగా.. ఇంకొందరు విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం గాయాన్ని కూడా లెక్కచేయని రష్మిక.. సూపర్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి కొందరు మాత్రం.. మరీ ఓవర్ యాక్షన్.. ట్రైలర్ ఈవెంట్ కు రాకపోతే ఏమైంది. అంత కుంటుతూ రావాల్సిన అవసరం ఏమైనా ఉందా.. ? బాలీవుడ్ సినిమా కాబట్టి వచ్చావ్.. అదే తెలుగు సినిమా అయితే వచ్చేదానివా.. ? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి చావా సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×