Srikakulam Sherlockholmes: కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాలే తన ఇంటిపేరుగా మార్చుకొని వెన్నెల కిషోర్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తన వారసుడిగా వెన్నెల కిషోర్ ను అధికారికంగా ప్రకటించాడు. కమెడియన్ గా ఉంటూనే హీరోలుగా మారిన నటులు చాలామంది ఉన్నారు. అయితే అందులో కొందరు హిట్స్ అందుకున్నారు.. ఇంకొందరు పరాజయాలను మూట కట్టుకున్నారు.
కమెడియన్ నుంచి హీరోగా మారిన వారిలో వెన్నెల కిషోర్ కూడా చేరాడు. ఇప్పటికే చారి 111 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెన్నెల కిషోర్. ఈ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. దానికి కారణం ప్రమోషన్స్ లేకపోవడమే. హీరోగా సినిమాలు చేసినా.. ప్రమోషన్స్ కు మాత్రం ఏరోజు వెన్నెల కిషోర్ అటెండ్ అవ్వలేదు.
కమెడియన్ గా ఉన్న మీరు హీరోగా ఎలా మారారు.. ? ప్రేక్షకులు ఆదరిస్తారనేనా.. ? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయనే భయం వలన కావొచ్చు. మరి ఇంకేదైనా కారణం అయ్యి ఉండొచ్చు కానీ, ప్రమోషన్స్ కు మాత్రం వెన్నెల కిషోర్ దూరంగా ఉంటాడు. దీనివల్లనే అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో అనేది కూడా తెలియలేదు. కానీ అదే సినిమ ఓటీటీలో మాత్రం విజయం అందుకుంది.
Vishnu Priya: ఛీఛీ.. విష్ణుప్రియా.. అవకాశాల కోసం మరీ ఇంతలా చూపించాలా..
ఇక చారి 111 తరువాత శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాతో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెన్నెల కిషోర్. మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల, సియా గౌతమ్, రవితేజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియలేదు అని చెప్పాలి.
అసలు ఈ సినిమా పండగ పూట రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈటీవీ విన్ లో జనవరి 24 నుంచి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ కు రెడీ అవుతుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ “రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధం కండి.. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈటీవీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.
ఇకశ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కథ విషయానికొస్తే.. ఒక ఊరిలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. మేరీ అనే యువతిని కొందరు హత్య చేస్తారు. ఆ హత్య కేసును ఛేదించాల్సిన బాధ్యత వెన్నెల కిషోర్ మీద పడుతుంది. అసలు మేరీని చంపింది ఎవరు.. ? ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు.. ? ఎందుకు హత్య చేశారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి థియేటర్ లో పరాజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.