E-Paper
Advertisement

Aho Vikramaarka Teaser: మగధీర విలన్ రణదేవ్ బిల్లా హీరోగా ‘అహో విక్రమార్క’.. టీజర్ అదిరిపోయింది

Aho Vikramaarka Teaser: మగధీర విలన్ రణదేవ్ బిల్లా హీరోగా ‘అహో విక్రమార్క’.. టీజర్ అదిరిపోయింది
Advertisement

Aho Vikramaarka Teaser: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. హీరోలు.. విలన్స్ గా మారొచ్చు. విలన్స్.. హీరోలుగా మారొచ్చు. మారుతున్నా జనరేషన్ లో హీరోలు, విలన్స్ అని ప్రేక్షకులు చూడడం లేదు. కథ నచ్చితే ఆదరిస్తున్నారు. కథ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా ప్లాప్ చేస్తున్నారు. ఇక దీంతో ఎవరైనా హీరోలుగా మారుతున్నారు.

తాజాగా బాలీవుడ్ నటుడు దేవ్ గిల్ హీరోగా మారాడు. దేవ్ గిల్ ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా.. ? మగధీర సినిమాలో రామ్ చరణ్ కు ధీటుగా విలనిజాన్ని పండించి మిత్రవింద నాది అని రాక్షసత్వాన్ని చూపించిన రణదేవ్ బిల్లా గుర్తున్నాడుగా.. అతనే దేవ్ గిల్. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన దేవ్.. మొదటిసారి హీరోగా మారి నటించిన చిత్రం అహో.. విక్రమార్క. పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కులకర్ణి, అశ్విని కుమార్ మిశ్రా నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఈ చిత్రం లో దేవ్ గిల్ సరసన తేజస్విని పండిట్, చిత్ర శుక్లా నటిస్తున్నారు. ఇప్పటికే ఈఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా అహో విక్రమార్క టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో దేవ్ గిల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తుంది. ” ఇది అసుర రాజ్యం.. ఇక్కడకు ఎవరైనా రావడమే తప్ప ప్రాణాలతో పోవడం ఉండదు” అని కాలకేయ ప్రభాకర్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

కొంతమంది పెత్తందారుల గుప్పిట్లో ఉండే గ్రామం. ప్రజలను బానిసల కంటే దారుణంగా చూస్తున్న ఆ గ్రామానికి పోలీస్ గా విక్రమార్క( దేవ్ గిల్) రావడం.. ఆ రాక్షుసులను ముప్పు తిప్పలు పెట్టించడం చూపించారు. పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇక ఆ రాక్షసుల అంతు చూసి ఆ గ్రామాన్ని హీరో కాపాడాడా.. ? లేదా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. దేవ్ గిల్.. పోలీస్ పాత్రలో కరెక్ట్ గా సెట్ అయ్యాడు. టీజర్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. అన్ని భాషల్లో తెరకెక్కిన ఈచిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో దేవ్ గిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×