BigTV English
Advertisement

Skoda New Kodiaq: స్కోడా నుంచి మరో కొత్త కారు.. డిజైన్, ఫీచర్లు వేరే లెవెల్.. ధర వివరాలివే..!

Skoda New Kodiaq: స్కోడా నుంచి మరో కొత్త కారు.. డిజైన్, ఫీచర్లు వేరే లెవెల్.. ధర వివరాలివే..!

Skoda New Kodiaq expected launching in India: ప్రముఖ చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఈ సంస్థ ఇప్పుడు తన లైనప్‌లో కొత్త కొడియాక్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ కారు టెస్ట్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ కార్‌కి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఈ కొత్త జనరేషన్ స్కోడా కొడియాక్ వైట్ కలర్‌లో ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీని ముందు భాగంలో స్కోడా 2డీ లోగో ఉంది. దీంతోపాటు ఇందులో మరెన్నో అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్లతో స్కోడా కొడియాక్ కారు త్వరలో మార్కెట్‌లో లాంచ్ అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందో అనే విషయాన్ని కంపెనీ వెళ్లడించలేదు. ఇకపోతే ఈ కొత్త స్కోడా కొడియాక్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 5సీటర్, 7 సీటర్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

అయితే ఇప్పుడు ఈ కొత్త స్కోడా కొడియాక్ కారు త్వరలో భారతీయ మార్కెట్‌లో కేవలం 7సీటర్ వెర్షన్‌లో మాత్రమే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన లుక్, డిజైన్‌తో వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మంచి అనుభూతిని కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 13 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చినట్లు తెలుస్తోంది.


Also Read: ఇదే కదా కావాల్సింది.. సింగిల్ ఛార్జ్‌తో 676 కి.మీ మైలేజ్.. రెండు మోడల్స్ వేరే లెవెల్..!

అలాగే 10 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, హెడ్స్ అప్ డిస్‌ప్లేను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొత్త స్కోడా కొడియాక్ కారులోని ఫీచర్స్ అన్నీ భారతీయ మార్కెట్‌లో లాంచ్ కాబోతున్న వెర్షన్‌లో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే సేఫ్టీ కోసం ఇందులో ఏడీఏస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) కూడా అందించే అవకాశం ఉందని సమాచారం.

ఈ కొత్త మోడల్ కొడియాక్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది 188బిహెచ్‌పి పవర్ వద్ద 320 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈ ఇంజన్ 7 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఈ ఏడాది 2024 నవంబర్‌లో భారతదేశంలో విడుదల కావచ్చని అంచనా వేయబడింది. ఇక దీని ధర విషయానికొస్తే.. కొత్త స్కోడా కొడియాక్ కారు రూ.39.99 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ కొత్త కారుకి సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Tags

Related News

Gold Rate Today: అయ్యయ్యో.. అతి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా..?

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

Big Stories

×