Devaki Nandana Vasudeva : గత రెండు వారాల నుంచి టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న క్రేజీ వార్తల్లో మహేష్ బాబు (Mahesh Babu) కృష్ణుడుగా కనిపించబోతున్నాడు అన్న న్యూస్ కూడా ఒకటి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ గోల్డెన్ ఛాన్స్ ని మహేష్ బాబు ఫ్యాన్స్ మిస్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అదికూడా ఆయన సతీమణి నమ్రత (Namratha Shirodkar) కారణంగా అనే టాక్ నడుస్తోంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘దేవకి నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) అనే మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన మానస వారణాసి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ‘హనుమాన్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించడంతో అంచనాలు పెరిగాయి. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోమినేని బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
గత రెండు వారాల నుంచి తన మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న ‘దేవకీ నందన వాసుదేవా’ (Devaki Nandana Vasudeva) సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్ పోషిస్తున్నారు అనే పుకారు షికారు చేస్తోంది. అయితే అంతకంటే ఎక్కువగా మహేష్ అభిమానులు సంబరపడింది ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నారు అన్న రూమర్ కి. క్లైమాక్స్ లో వచ్చే శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటాయని, అందులో మహేష్ బాబు నటిస్తే బాగుంటుందని చిత్ర బృందం భావించినట్టుగా వార్తలు వచ్చాయి.
కానీ నిజానికి ‘దేవకీ నందన వాసుదేవా’ (Devaki Nandana Vasudeva) సినిమాలో మహేష్ బాబు నటించకుండానే, సీజీ వర్క్ లో ఆయనను శ్రీకృష్ణుడిగా క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఏదైతేనేం క్లైమాక్స్ లో మహేష్ బాబు కృష్ణుడి అవతారంలో దర్శనం ఇస్తే చాలు అని ఖుషి అయ్యారు మహేష్ ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
విషయం ఏమిటంటే… రెండు వారాల క్రితమే వచ్చిన మహేష్ శ్రీకృష్ణుని పాత్రకు సంబంధించిన లీక్ పై ఆయన సతీమణి నమ్రత సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఆ పాత్రలో మహేష్ బాబు కనిపించకుండా ‘దేవకి నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) టీం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో కనీసం సీజీ వర్క్ లో కూడా మహేష్ బాబు కనిపించే ఛాన్స్ ఉండదనే న్యూస్ తో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మొత్తానికి మళ్లీ మహేష్ ని తెరపై చూడాలంటే ‘ఎస్ఎస్ఎంబి 29’ వచ్చేదాకా వెయిట్ చేయక తప్పేలా కనిపించట్లేదు. కానీ జక్కన్న ఈ సినిమాను చెక్కడానికి ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా మహేష్ ను తెరపై చేసే భాగ్యం ఫ్యాన్స్ కు లేనట్టే !