E-Paper
Advertisement

NTR: పెద్ద ఎన్టీఆర్ డ్యాన్స్ ను దింపేశాడు మావా.. ఆయుధ పూజకు పూనకాలేరా

NTR: పెద్ద ఎన్టీఆర్ డ్యాన్స్ ను దింపేశాడు మావా.. ఆయుధ పూజకు పూనకాలేరా
Advertisement

NTR: దేవర ముంగిటనువ్వెంత..  ఈ ఒక్క డైలాగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్  సోలో హీరోగా  దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. పది రోజుల నుంచే దేవర సెలబ్రేషన్స్  మొదలయ్యాయి. ఇక ఈ ఒక్కరాత్రి గడిస్తే చాలు.. థియేటర్ వద్ద ఎవరిని ఆపలేరు. అంతలా ఈ సినిమా కోసం  అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ  దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్రంతోనే బాలీవుడ్ బ్యూటీ  జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతుంది. ఇక  అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ సైతం ఈ సినిమాతోనే విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు దేవర టీమ్ చేసిన ప్రమోషన్స్  అన్ని ఒక లెక్క.. ఈ ఒక్కరోజు  మేకర్స్ చేసిన ప్రమోషన్స్ మరో లెక్క.  ఆ ప్రమోషన్స్ పేరే.. ఆయుధ పూజ సాంగ్ ను రిలీజ్ చేయడం.

Advertisement

దేవర అంటే ఆయుధ పూజ అని.. ఎన్నో రోజులుగా మేకర్స్ ఊరిస్తూ  వచ్చారు. అందులో  ఎన్టీఆర్ డ్యాన్స్, అనిరుధ్ మ్యూజిక్.. లిరిక్స్.. థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే అని చిత్ర బృందం చెప్పుకొచ్చారు. ఎప్పుడు దేవర నుంచి అప్డేట్ వచ్చినా కూడా ఆయుధ పూజ సాంగ్ అనుకోని ఉలిక్కిపడిన ఫ్యాన్స్ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక మొత్తం అయ్యిపోయి కొన్ని గంటలు మాత్రమే ఉంది అనుకున్న  సమయంలో బ్రహ్మాస్త్రాన్ని దింపినట్లు ఈ సాంగ్ ను దింపారు.

” ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు.. రణధీరుల పండగ నేడు.. కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు.. మన జట్టుగ ఆడెను చూడు” అంటూ మొదలైన ఈ సాంగ్ లో ఎన్టీఆర్  డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.  అసలు ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే.. చూసేవారి కళ్లు పక్కకు కూడా పోవు.. ఆయుధ పూజ సాంగ్ లో అది కచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుంది. అంతలా ఎన్టీఆర్ డ్యాన్స్ చేశాడు.

Advertisement

ముఖ్యంగా ఈ సాంగ్ లో తారక్.. తన తాతగారు అయిన  ఎన్టీఆర్ స్టెప్స్ ను డిట్టో దింపేశాడు. చేతులు పైకి కదుపుతూ.. ఊగుతూ పెద్ద ఎన్టీఆర్  చేసినట్లే చేశాడు. నిజంగా ఎన్టీఆర్ నే పై నుంచి దిగివచ్చాడా.. ? అన్నట్లు ఉందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రోమోలో ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఫిదా కానివారు ఉండరు  అంటే అతిశయోక్తి  కాదు. ప్రస్తుతం ఈ ప్రోమో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మరి ఈ సాంగ్ కు రేపు థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారా.. ? లేదా అనేది చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×