BigTV English

Bank Holidays: అక్టోబర్ లో బ్యాంకులకు అన్ని సెలవులా? ప్లాన్ చేసుకోకుంటే చిక్కులే.. వివరాలు మీకోసమే

Bank Holidays: అక్టోబర్ లో బ్యాంకులకు అన్ని సెలవులా? ప్లాన్ చేసుకోకుంటే చిక్కులే.. వివరాలు మీకోసమే

Bank Holidays: అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఈ నెలలోనే దసరా పండుగ కూడా రాబోతోంది. ఇక సెలవుల జాతరేనని చెప్పవచ్చు. పాఠశాలలకు సెలవులు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు.. బ్యాంకులకు సెలవులు ఇలా ఈ నెలలో సెలవులే సెలవులు. అందుకే అక్టోబర్ నెల సెలవులకు మారుపేరని చెప్పవచ్చు.


ఈ నెలలో సెలవులు అధిక సంఖ్యలో రాగా.. టూర్స్ ప్లానింగ్ చేసే పనిలో అందరూ బిజీ అయ్యారనే చెప్పవచ్చు. స్వగ్రామాలకు వెళ్లేవారు.. అలాగే విహారానికి వెళ్ళేవారు ఎవరి ప్లానింగ్స్ వారివి. అంతా బాగుంది కానీ బ్యాంకులకు సెలవులు అంటే కొంచెం జాగ్రత్త పడాల్సిందే మరి. ప్రస్తుతం యూపిఐ పేమెంట్స్ అధికమైనప్పటికీ.. బ్యాంకుల ద్వారా అందే సేవలు సైతం అంతే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బ్యాంకులకు సెలవులు ప్రకటించారా.. ముందస్తు ప్లానింగ్ లేకుంటే ఇబ్బంది తప్పదు. అందుకే అక్టోబర్ నెలలో అసలు బ్యాంక్ సెలవులు ఎన్ని రోజులు వచ్చాయో తెలుసుకుంటే మీరు షాక్ కావాల్సిందే. అలాగే సెలవులకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకొని, బ్యాంకులు అందించే సేవలు వినియోగించుకోవాలని తెలుపుతూ.. అక్టోబర్ నెల బ్యాంకుల సెలవుదినాల ప్రకటన విడుదలైంది.

ఇక దేశవ్యాప్త బ్యాంక్ సెలవుల వివరాల్లోకి వెళితే..


అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 3 : దసరా ప్రారంభం
అక్టోబర్ 6 : ఆదివారం
అక్టోబర్ 10 : మహా సప్తమి
అక్టోబర్ 11 : మహా నవమి
అక్టోబర్ 12 : విజయదశమి
అక్టోబర్ 13 : ఆదివారం
అక్టోబర్ 17 : మహర్షి వాల్మీకీ జయంతి
అక్టోబర్ 20 : ఆదివారం
అక్టోబర్ 26 : బ్యాంకుల మూసివేత
అక్టోబర్ 27 : ఆదివారం
అక్టోబర్ 29 : దీపావళి
అక్టోబర్ 30 : ఐచ్చిక సెలవుదినం
అక్టోబర్ 31 : నరక చతుర్దశి

Also Read: Samsung : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఈ ప్రకటనను బట్టి దేశ వ్యాప్తంగా 14 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మాత్రం 7 రోజుల సెలవు దినాలను బ్యాంకులు ప్రకటించాయి. ఆ వివరాలు ఇవే..

అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 10 : మహా సప్తమి
అక్టోబర్ 11 : మహా అష్టమి
అక్టోబర్ 12 : రెండవ శనివారం, మహా నవమి, విజయదశమి
అక్టోబర్ 13 : ఆదివారం
అక్టోబర్ 26 : నాల్గవ శనివారం
అక్టోబర్ 27 : ఆదివారం
సెలవుల జాతర గల అక్టోబర్ నెలలో ఊహించని రీతిలో బ్యాంకులకు హాలిడేస్ రాగా.. అందుకు తగ్గ రీతిలో ప్లాన్ చేసుకోండి మరి. ఏదైనా అకౌంట్ ప్రారంభించాలన్నా.. బ్యాంకుల విస్తృత సేవలు పొందాలన్నా ఈ సెలవుల రోజుల్లో వెళ్లొద్దు సుమా !

Related News

Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?

Sajjala Ramakrishna Reddy: సజ్జలకు జగన్ వార్నింగ్? వారికి మాత్రం పండగే

TTD VIP Darshan: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

AP Mega DSC: నవంబర్‌లో టెట్ ఎక్జామ్ .. ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

YS Sharmila: ఓటు చోరీ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో బయటపెడతాం: షర్మిల

Onion Price: కిలో ఉల్లి రూ.5 మాత్రమే.. ఎక్కడో కాదు మన రాష్ట్రాల్లోనే!

Aghori Hulchul In Guntur: చంద్రగ్రహణం రోజు అఘోరాల పూజలు.. విరుగుడుగా శాంతి పూజలు

AP Politics: ఏపీని షేక్ చేస్తున్న ఐఏఎస్ గిరిషా.. అసలు కథ ఇదే..

Big Stories

×