BigTV English

Devara Movie: ఓవర్సీస్‌లో డల్ అయిన ‘దేవర’.. రికార్డులు బద్దలుగొట్టడం కష్టమేనా?

Devara Movie: ఓవర్సీస్‌లో డల్ అయిన ‘దేవర’.. రికార్డులు బద్దలుగొట్టడం కష్టమేనా?

Devara Movie: ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ ప్రీ బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో కూడా ప్రీ బుకింగ్స్ విషయంలో ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిందంటూ కొత్త కొత్త పోస్టర్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్. కానీ రియాలిటీ చూస్తే దానికి చాలా భిన్నంగా అనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, హిందీలో ‘దేవర’కు మామూలు క్రేజ్ లేదు. హిందీలో అయితే చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే ఓవర్సీస్‌లో కూడా పరిస్థితి అలాగే ఉందని మేకర్స్ చెప్తున్నా.. పలు పరిణామాలు చూస్తుంటే అది పూర్తిగా నిజం కాదేమో అనే సందేహం వస్తుంది.


సినిమాపై ఎఫెక్ట్

ఓవర్సీస్‌లో ఉండే తెలుగు మూవీ లవర్స్ సంఖ్య ఎక్కువే. వారితో పాటు పలువురు అమెరికన్స్ కూడా సబ్‌టైటిల్స్‌తో తెలుగు సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ప్రస్తుతం ఫ్లోరిడాను వరదలు ముంచెత్తుతున్నాయి. తుఫాన్, వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి సమయంలో సినిమాను చూడడానికి ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడం అనేది చాలా తక్కువ. ఎక్కువశాతం ఇలాంటి వాతావరణంలో అందరూ ఇళ్లల్లో ఉండడానికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే అమెరికాలోని ఒక రాష్ట్రం మొత్తం సినిమాను చూసి ఆనందించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎఫెక్ట్.. ప్రీ బుకింగ్‌పై మాత్రమే కాకుండా కలెక్షన్స్‌పై కూడా పడుతుంది.


Also Read: మరోసారి ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. ఆ థియేటర్లలో ‘దేవర’ ప్రీమియర్ రద్దు

అదే డౌట్

అమెరికాలో మాత్రమే కాదు.. ఆస్ట్రేలియాలో కూడా అంతంత మాత్రమే బుకింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. ప్రీ బుకింగ్సే తక్కువగా ఉంటే కలెక్షన్స్ కూడా తక్కువగానే వస్తాయి. ‘దేవర’ మూవీతో పలు సినిమాల రికార్డులు బ్రేక్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే కలెక్షన్స్ బాగానే వచ్చినా రికార్డులు బ్రేక్ చేసే రేంజ్‌కు వెళ్తుందా లేదా అన్నదే డౌట్. ఇది ఒకరకంగా ‘దేవర’ టీమ్‌కు షాక్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘దేవర’కు ఉన్న హైప్ చూస్తుంటే కాస్త మంచి టాక్ వచ్చినా మూవీ బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్‌ను సాధిస్తుంది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఓవర్సీస్ పరిస్థితి ఏంటి అనేది అక్కడ సినిమా విడుదల అయ్యాక క్లారిటీ వస్తుంది.

పార్ట్ 2 కూడా

ఇప్పటికే కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ‘జనతా గ్యారేజ్’తో అప్పటివరకు తానెప్పుడు చేయని జోనర్‌ను ఎన్‌టీఆర్ టచ్ చేశాడు. పైగా ఎన్‌టీఆర్ ఒక ప్రకృతి ప్రేమికుడి పాత్రలో కనిపించడం కూడా ఆడియన్స్‌ను అలరించింది. ఇక ‘దేవర’లో తాను ఒక మత్స్యకారుడిగా డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడు. పైగా ఈ సినిమా ఒక పార్ట్ కాకుండా రెండు భాగాల్లో విడుదల కానుందని ఇప్పటికే దర్శకుడు కొరటాల ప్రకటించాడు. ‘దేవర’ పార్ట్ 1 హిట్ అయితే.. పార్ట్ 2 కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అర్థరాత్రి ఫ్యాన్ షో తర్వాత అసలు సినిమా ఏంటనే విషయం బయటపడుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×