BigTV English

Devara Movie First Review : దేవర ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా…

Devara Movie First Review : దేవర ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా…

Devara Movie First Review : గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 27 న సినిమా ను గ్రాండ్ గా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా విడుదల డేట్ దగ్గర పడుతుండటం తో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలవుతుంది. అయితే ఈ సినిమాను కొందరు ప్రముఖ దర్శకులు ప్రివ్యూ చూసేశారు.. వారి మాటల్లో సినిమా ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇకపోతే సెప్టెంబర్ 27న తెలుగు తో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున దేవర సినిమా విడుదల కానుంది. శుక్రవారం మిడ్ నైట్ నుంచి తెలుగు రాష్ట్రాలలో సైతం బెనిఫిట్ షోలు పడనున్నాయి.. దీనికన్నా ముందే హైదరాబాద్ లో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఈ సినిమాను హీరో, దర్శకులు రాజమౌళి తదితరులు ఫైనల్ కాపీని హైదరాబాద్ లో చూశారు. సినిమా ఎలా ఉందో అభిమానులతో పంచుకున్నారు. ఫస్ట్ రివ్యూ ఇదే..

Devara First Review.. Climax Scenes Highlight
Devara First Review.. Climax Scenes Highlight

సెకండ్ ఆఫ్ చాలా బాగుంది. చివరి అరగంట అయితే అదిరిపోయింది అని సన్నిహితులకు తెలియజేశారట. దాంతో ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల లో సంతోషం వ్యక్తం అవుతోంది.. ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతుంది. సినిమాను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక మరోవైపు దేవర కన్నా ముందు కొరటాల శివ తెరకేక్కించిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి… ఇటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి యాక్ట్ చేశారని క్రేజ్ ముందు సినిమా తేలిపోయిందని, కొరటాల శివ సరిగా తీయలేదని కొంత మంది కామెంట్లు చేశారు.


ఆచార్య లాగా ఈ సినిమా కూడా దెబ్బస్తుందా అనే అనుమానాల నుంచి జనాలు బయటకు వచ్చారు. ‘దేవర’ సినిమా పై ‘ఆచార్య’ ఎఫెక్ట్ ఏమీ పడలేదు. ప్రేక్షకులలో ట్రేడ్ సర్కిళ్లను సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో  కొరటాల శివకు కొంత రిలీఫ్ వచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఎస్.ఎస్.రాజమౌళి ప్రశాంత్ ని లోకేష్ కనకరాజ్ వంటి పాన్ ఇండియా దర్శకుల సరసన కొరటాలా చేరిపోవడం పక్కా. పాన్ ఇండియా సినిమాగా దేవర మూవీ రాబోతుంది. ఇక దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా… అందులో కొడుకు క్యారెక్టర్ సరసన జాన్వీ కపూర్ కథానాయిక గా నటించారు. విలన్ తరహా కీలక పాత్ర లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.. వీరితో పాటుగా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అనిరుద్ సంగీతం అందించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×