BigTV English

OTT Movie : చెవిటివాడు స్పై అంటూ ఇన్వెస్టిగేషన్… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే స్పై థ్రిల్లర్

OTT Movie : చెవిటివాడు స్పై అంటూ ఇన్వెస్టిగేషన్… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే స్పై థ్రిల్లర్

OTT Movie : స్పై థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ఎంతటి ఆదరణ ఉందా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఈ కేటగిరీకి సంబంధించిందే. పైగా ఈ సినిమా డజన్ల కొద్ది ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి ప్రశంసలు దక్కించుకుంది. ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్న ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా పేరేంటి? విషయాలను తెలుసుకుందాం పదండి.


డజన్ల కొద్ది ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శన

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ హిందీ చిత్రం. తెలుగు మూవీ లవర్స్ కు ఈ మూవీ విషయంలో ఇదొక్కటే నిరాశను కలిగించే విషయం. భాష అనేది అడ్డు కాదు అనుకుంటే ఈ వీకెండ్ స్పై థ్రిల్లర్ మూవీ లవర్స్ సరదాగా ఈ సినిమాను చూడవచ్చు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ హాబిటాట్ ఫిలిం ఫెస్టివల్,  మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో సహా డజన్ల కొద్ది ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శన చేసే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో అపరశక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయి. ఈ సినిమాలో కబీర్ బడి, రాహుల్ బోస్, రితేష్ శ్రీనివాస్, అనుప్రియ గోయెంకా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ మూవీని జీ స్టూడియోస్ అండ్ ఇప్పికి యాయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై మానవ్ శ్రీవాత్సవ, ఉమేష్  కెఆర్ బన్సల్ సంయుక్తంగా నిర్మించారు. గత శుక్రవారం ఈ సినిమా జీ 5 అనే ఓటిటి లో అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా కేవలం హిందీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే సమాచారం లేదు. కానీ ఒక్క హిందీలో భాషలోనే రిలీజై, మూడు రోజుల్లోనే 50 మిలియన్ల పైగా వ్యూస్ సాధించి ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.


Berlin Review: A refreshing, minimalistic, sensitive, yet powerful spy thriller

స్టోరీ లోకి వెళ్తే…

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఢిల్లీ నేపథ్యంలో 1990ల సమయంలో నడుస్తుంది. అశోక్ కుమార్ అనే వ్యక్తికి చెవులు వినిపించవు. ఇలాంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఇంటలిజెన్స్ అధికారులు అతన్ని విదేశీ గూడచారిగా అనుమానిస్తారు. కరెక్ట్ గా అదే టైంలో రష్యా అధ్యక్షుడి భారత పర్యటన ఉంటుంది. సాదారణంగా చెవులు విన్పించని వ్యక్తులను తేలిగ్గా తీసుకుంటాము. అలాగే వాళ్ళతో మాట్లాడడం కూడా కష్టమే. బాగా పరిచయం ఉంటే తప్ప వాళ్ళు చెప్పేది అర్థం కాదు. అందుకే ఇంటలిజెన్స్ అధికారి అయిన జగదీష్ సోది అశోక్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి పుష్కిన్ వర్మ అనే నిపుణుని తీసుకొస్తాడు. ఆ తర్వాత సినిమాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, షాకింగ్ నిజాలు బయట పడతాయి. అసలు ఈ అశోక్ కుమార్ ఎవరు? అతన్ని పోలీసులు ఎందుకు అనుమానిస్తున్నారు? చివరికి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి? అనే విషయాలు తెలియాలంటే బెర్లిన్ అనే ఈ సినిమాపై ఓ లుక్కేయండి.

Tags

Related News

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

Big Stories

×