E-Paper
Advertisement

Devara: కలెక్షన్లు తగ్గడం వెనుక వారి హస్తము ఉందా.. అసలు నిజం ఏంటంటే..?

Devara: కలెక్షన్లు తగ్గడం వెనుక వారి హస్తము ఉందా.. అసలు నిజం ఏంటంటే..?

Devara.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా (NTR) తాజాగా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేసిన చిత్రం దేవర (Devara ). ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి తర్వాత మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా దేవర నిలిచింది. ఇకపోతే మొదటినుంచి ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా అందరికీ రీచ్ అవ్వలేదనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎందుకంటే తాజాగా తగ్గుతున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఇది స్పష్టం అవుతోందని చెప్పవచ్చు.

ప్రమోషన్స్ చేయకపోవడమే సినిమా నష్టానికి ప్రధాన కారణం..

సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆ రేంజ్ లో కలెక్షన్లు సాధించకపోవడానికి కారణం చిత్ర బృందమే అనే ఒక వాదన తెరపైకి వచ్చింది. ఎందుకంటే సరైన రీతిలో ప్రమోషన్స్ చేపట్టలేదు. కథ ఎలా ఉన్నా సరే.. సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి తొలి అడుగు ప్రమోషన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా తన సినిమాను ప్రమోషన్స్ తోనే హైప్ తెప్పించి భారీ బ్లాక్ బస్టర్ విజయం కట్టబెట్టడం ఒక రాజమౌళికే తెలుసు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తున్నారు. ముఖ్యంగా హిందీలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కానీ తెలుగులో కనీసం ఒక్క ఈవెంట్ కూడా చేయకపోవడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

బాలీవుడ్ పై ఫోకస్.. ఫైర్ అవుతున్న తెలుగు తమ్ముళ్లు..

ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లాగా తారక్ స్టైల్ ఫన్నీ ఇంటర్వ్యూలన్నీ కూడా ఇక్కడ మిస్ అయిపోయాయి. ప్రస్తుతం అందరూ బాలీవుడ్ పైన ఫోకస్ పెడుతున్నారు కానీ ఇక్కడ వారి కెరియర్ కు పునాది వేసిన తెలుగు ఆడియన్స్ ను మరిచిపోవడం ఏమాత్రం సమంజసం గా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇకపోతే దేవరా సినిమా ప్రమోషన్స్ ను కేవలం బాలీవుడ్ లోనే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ చేయకపోయేసరికి ఆడియన్స్ లో పూర్తి నిరాశ ఏర్పడుతుందని చెప్పవచ్చు.

దసరా సెలవులను వినియోగించడంలో చిత్ర బృందం ఫెయిల్ అయ్యిందా..?

అందుకే రోజు రోజుకి కలెక్షన్లు కూడా పడిపోతున్నాయి. నిజానికి దసరా అంటే అతిపెద్ద సీజన్ , సోలోగా రిలీజ్ అయింది. పైగా ఎన్టీఆర్ చిత్రం కావడంతో ఈ సినిమాకి పోటీగా మరో సినిమా విడుదల కాలేదు. మరి ఈ సెలవులను క్యాష్ చేసుకోవాలి అంటే ఆడియన్స్ లో హైప్ పెంచాలి. మరి అందరి దృష్టి ఆకర్షించాలంటే కచ్చితంగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రమోషన్స్ చేయకుండా సైలెంట్ అయిపోవడంతో ఏకంగా భారీ కలెక్షన్లను వదులుకుంటోంది చిత్ర బృందం అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా అనే బెస్ట్ సీజన్ లో సోలో హీరోగా రిలీజ్ అయినా.. ఆడియన్స్ మాత్రం థియేటర్ బాట పట్టడం లేదు. మొదటి రోజే రూ .172 కోట్లు అని చెప్పుకుంటూ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. 6 రోజులైనా సరే కేవలం రూ .396 కోట్లు మాత్రమే వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేసింది. దసరా సెలవులు మొదలైనా సరే కలెక్షన్లు మాత్రం పెరగడం లేదు. ఇప్పటికైనా తేరుకొని ప్రమోషన్స్ చేపడితే , కలెక్షన్లు పెరిగి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ ఆలస్యం ఏం కాలేదు ఇప్పుడైనా హుషారు పడి ప్రమోషన్స్ మొదలు పెడతారో లేదో చూడాలి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×