E-Paper
Advertisement

Kasthuri Shankar: సురేఖ వివాదంలోకి త్రిషను లాగిన బుల్లితెర నటి.. కొత్తేమి కాదంటూ..?

Kasthuri Shankar: సురేఖ వివాదంలోకి త్రిషను లాగిన బుల్లితెర నటి.. కొత్తేమి కాదంటూ..?
Advertisement

Kasthuri Shankar.. బుధవారం అనగా అక్టోబర్ 2వ తేదీన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ప్రత్యర్థి కేటీఆర్ (KTR) ను టార్గెట్ చేస్తూ సినీ సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.. కేటీఆర్ వల్లే సమంత – నాగచైతన్య విడిపోయారంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు సినీ సెలబ్రిటీల కి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని మొదలుకొని కిరణ్ అబ్బవరం వరకు ఇలా చాలామంది సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , మహేష్ బాబు, రవితేజ, నాని ,అల్లు అర్జున్, రాంగోపాల్ వర్మ, డైరెక్టర్ హరీష్ శంకర్ , నాగచైతన్య, నాగార్జున , లావణ్య త్రిపాఠి, సంయుక్త మేనన్ , రకుల్ ప్రీత్ సింగ్ ఇలా దాదాపు టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అందరూ కూడా ఈ విషయంపై స్పందిస్తూ మహిళ మంత్రి కొండా సురేఖ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్నారు.

అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటున్న సెలబ్రిటీస్..

Advertisement

అయితే ఇదే సమయంలో మరికొంతమంది సెలబ్రిటీలు టాలీవుడ్ సెలబ్రిటీలపై మండిపాటుకు గురవుతున్నారు. ప్రస్తుతం సమంత విషయంలో జరిగినందుకు సినీ సెలబ్రిటీలంతా ఏకతాటిపైకి రావడం చాలా ప్రశంసనీయంగా ఉంది. కానీ గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలపై రాజకీయ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు. అప్పుడు ఎందుకు మౌనం వహించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పూనమ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ గతంలో పోసాని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లను అడ్డం పెట్టుకొని తనను కూడా పరోక్షంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు..అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ సినీ సెలబ్రిటీలను ప్రశ్నించింది పూనమ్

కొండా సురేఖ పై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్..

Advertisement

అయితే ఇప్పుడు మరో బుల్లితెర నటి కస్తూరి శంకర్ కూడా ఈ విషయంపై కామెంట్లు చేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలను కార్నర్ చేయడం రాజకీయ నాయకులకు అలవాటు అంటూ చెప్పి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో హీరోయిన్ గా నటించింది కస్తూరి శంకర్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

నటులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు కొత్తేమీ కాదు.

అయితే ఇప్పుడు కొండా సురేఖ వివాదం పై తాజాగా స్పందించింది కస్తూరి శంకర్ (Kasturi Shankar). ముఖ్యంగా సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆమె, ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. నటులపై ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఒక తమిళనాడు పొలిటీషియన్ కూడా త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు.. త్రిష కావాలని ఓ పొలిటీషియన్ ని కోరడంతో.. మరో నటి ద్వారా ఆమెను పంపించినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు.. అంటూ కస్తూరి శంకర్ తెలిపింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కుటుంబం పై పగబట్టినట్లుంది అంటూ కామెంట్లు చేసింది కస్తూరి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×