E-Paper
Advertisement

Devara : ఋణపడి ఉంటా… దేవర రెస్పాన్స్ కు ఉబ్బితబ్బివుతున్న ఎన్టీఆర్

Devara : ఋణపడి ఉంటా… దేవర రెస్పాన్స్ కు ఉబ్బితబ్బివుతున్న ఎన్టీఆర్
Advertisement

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా థియేటర్లలో దేవర రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకుంటూ కనిపిస్తున్నారు అభిమానులు. ఒకవైపు మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం మూవీ సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి స్పెషల్ గా ట్వీట్ చేశారు.

వాళ్లందరికీ రుణపడి ఉంటా…

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ పట్ల అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు. అదే విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. తారక్ తన ట్వీట్ లో “ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మీ అపురూపమైన స్పందనతో నేను ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. కొరటాల శివ గారు ఇంత ఎంగేజింగ్ డ్రామా, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థాంక్స్. నా సోదరుడు అనిరుధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవర ప్రపంచానికి జీవం పోశాయి. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాకు బలమైన స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. డిఓపి రత్నవేల్, శ్రీకర్ ప్రసాద్ లతో పాటు ఇందులో పని చేసిన ప్రతి టెక్నీషియన్ పని అద్భుతం. నా అభిమానులలు.. దేవర కోసం మీరు జరుపుకుంటున్న వేడుకలను చూడడం నన్ను చాలా ఉప్పొంగిపోయేలా చేస్తుంది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరిని ఇలాగే అలరిస్తూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అంటూ ‘దేవర’ మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు ఎన్టీఆర్. పేరు పేరునా ఎన్టీఆర్ తన టీమ్ తో పాటు అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆయన సంతోషంలో మునిగితేలుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అప్పుడే పండగ అయిపోలేదు.

‘దేవర’కు మిక్స్డ్ టాక్

Advertisement

ఎన్టీఆర్ ఓ ఈవెంట్ లో చెప్పినట్టుగానే ఆయన అభిమానులు అయితే మూవీ బాగుంది అంటూ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. కానీ విమర్శకులు మాత్రం ఆశించిన రేంజ్ లో లేదంటూ రివ్యూ ఇస్తున్నారు. దీంతో మొదటి రోజే మిక్స్డ్ టాక్ నడుస్తోంది. పైగా క్లైమాక్స్ అంతగా బాగాలేదు, కొరటాల మార్క్ మిస్ అంటూ కామెంట్స్ విన్పిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న సందడే కన్పిస్తోంది. ఇది కాస్త తగ్గితే ‘దేవర’ అసలు అంచనాలను అందుకుందా, లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. మరి చివరకు ‘దేవర’ మూవీపై జనాల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మూవీతో ఎన్టీఆర్ ఫస్ట్ సోలో 100 కోట్ల ఓపెనింగ్ మూవీ రాబడతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రీ సేల్స్ అయితే గట్టిగానే జరిగాయి. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనే ఇంట్రెస్టింగ్ విషయం ఆసక్తిని రేపుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×