BigTV English
Advertisement

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Khushboo.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనే వార్త సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ (Prakash Raj), కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)లాంటి తారలు ఈ విషయం పై స్పందించారు కూడా.. అయితే తాజాగా ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు , ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Khushboo )ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.


లడ్డూ వివాదంపై ఖుష్బూ సంచలన ట్వీట్..

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా.. తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు కలపడం అత్యంత దారుణం, ఈ చర్యకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే.ముఖ్యంగా మీరు చేసిన తప్పు వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు అంటూ ఖుష్బూ ట్వీట్ చేసింది. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్ గా ఉండమంటే ఎలా.. ఇతర మతాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా..? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా లౌకికవాదం అంటే ప్రతి ఒక్కరూ ప్రతి మతాన్ని గౌరవించడం. అంతేకానీ పక్షపాతంతో వ్యవహరించకూడదు. నేను కూడా హిందూ మతంలో పుట్టకపోయినా , హిందూ మతానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకున్నాను. ముఖ్యంగా నా దృష్టిలో అన్ని మతాలవారు సమానమే. కాబట్టి ఎవరూ కూడా హిందూ మతాన్ని అవమానించవద్దు అలాగే చులకనగా మాట్లాడవద్దు, మతాన్ని అవహేళనగా చూసి అగౌరవపరిస్తే సహించేది లేదు. తిరుమల లడ్డూ లో కల్తీ చేయడం అంటే కోట్లాదిమంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీయటమే కదా.. కాబట్టి తప్పకుండా బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నాడు అంటూ ఖుష్బూ తన పోస్టులో తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. ఇలా లడ్డు వివాదంలో కామెంట్ చేసి ఏదైనా సమస్యలో ఇరుక్కోబోతోందా అంటూ నేటిజన్స్ కంగారుపడుతున్నారు.


ఖుష్బూ కెరియర్..

ఖుష్బూ విషయాన్నికొస్తే తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రజల పట్ల అలాగే సమాజం పట్ల ఈమెకు చాలా అవగాహన కూడా ఉంది. ఈమె ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ తర్వాత హిందూ మతానికి చెందిన ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇకపోతే కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలనే రీతిలో కాకుండా స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే తన పిల్లల విషయంలో కూడా ఎప్పుడూ ఆమె కఠిన ఆంక్షలు విధించలేదని సమాచారం. ముఖ్యంగా తన పిల్లలను తనలాగే స్వేచ్ఛగా పెంచుతుంది. ఇక ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న ఖుష్బూ. ఇలా లడ్డు వివాదం పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×