E-Paper
Advertisement

Devara: ‘దేవర’ ఓటీటీ డేట్ లాక్ .. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Devara: ‘దేవర’ ఓటీటీ డేట్ లాక్ .. స్ట్రీమింగ్ అప్పటినుంచే?
Advertisement

Devara Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తాజాగా నటించిన ‘దేవర’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ స్పందన వస్తుంది. ఎన్టీఆర్‌ ను ఎలా చూడాలి అనుకున్నామో అలా ఈ సినిమాలో ఉన్నారంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు దేవర సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో టాక్ తో కొరటాల సేఫ్ అయ్యాడు.. దేవర మూవీ మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరోవైపు కలెక్షన్స్ మోత మోగిపోతుంది. ఈ రిజల్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దేవర డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ ఒకింత భారీగానే ఖర్చు చేసింది. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో సాధించిన సంచలన రికార్డులు దేవర డిజిటల్ హక్కులకు డిమాండ్ ఏర్పడటానికి కారణమని చెప్పవచ్చు. అందుతున్న సమాచారం మేరకు దేవర సినిమాకు నెట్ ఫ్లిక్స్ రూ. 155 కోట్ల వరకు ఖర్చు చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ వచ్చేసింది. దేవర సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అప్పటివరకు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూసే పరిస్థితి అయితే ఉండదని చెప్పవచ్చు. నవంబర్ 20 తర్వాత దేవర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నిన్న వార్తలు వినిపించాయి..

Advertisement

కానీ దేవర సినిమా ఈ దివాళి సందర్బంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతుందని సమాచారం. అక్టోబర్ 31 కు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అటు దేవర టీమ్, ఇటు నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. దేవర థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఓటీటీలో సైతం సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. దేవర మూవీలో తండ్రీ కొడుకుల పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడొచ్చిన ఈ మూవీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుందేమో తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం దేవర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా రిజల్ట్ బాగానే ఉంది. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×