E-Paper
Advertisement

Tollywood heroin: హాస్పిటల్ పాలైన యంగ్ బ్యూటీ.. కంగారులో ఫ్యాన్స్..!

Tollywood heroin: హాస్పిటల్ పాలైన యంగ్ బ్యూటీ.. కంగారులో ఫ్యాన్స్..!
Advertisement

Tollywood heroin.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అతి కొద్ది మంది యంగ్ బ్యూటీస్ లో ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lakshmi)కూడా ఒకరు. తన అంద చందాలతో క్యూట్ స్మైల్ తో గ్లామరస్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె, సడన్ గా హాస్పిటల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. తన చేతికి సెలైన్ బ్యాండేజ్ తో కనిపించింది. దీంతో ఈమెకు ఏమైంది అంటూ అభిమానులు సైతం కంగారు పడిపోతున్నారు. ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ అందరినీ నవ్విస్తూ.. అంద చెందాలతో ఆకట్టుకునే ఈమె.. సడన్ గా ఇలా హాస్పిటల్ బెడ్ పై కనిపించేసరికి అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని పోస్టులు కూడా పెడుతున్నారు.

ఇండస్ట్రీకి తొలి పరిచయం..

Advertisement

ఐశ్వర్య లక్ష్మీ.. చేసింది తక్కువ సినిమాలు అయినా మంచి ఫాలోయింగ్ అందుకున్న ఈమె అందం, అభినయంతో ఆకట్టుకుంది. మలయాళ ఇండస్ట్రీలో చాలా సినిమాలలో నటించి మెప్పించిన ఈమె తమిళ్లో యాక్షన్ అనే సినిమాతో పరిచయమై.. సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు అందుకోలేదు. ఆ తర్వాత అమ్ము అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. అయితే తమిళంలో ఈమె నటించిన మట్టి కుస్తీ సినిమా తెలుగు లో డబ్బింగ్ అయి..ఈమెకు మంచి పేరు లభించింది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమాలో కూడా నటించింది.

హాస్పిటల్ పాలైన ఐశ్వర్య లక్ష్మీ..

Advertisement

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఐశ్వర్య లక్ష్మీ. ఇదిలా ఉండగా తాజాగా ఈమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా పంచుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు ఏమైంది ఎందుకు హాస్పిటల్ పాలైంది.. అనే విషయాలు మాత్రం తెలియ రాలేదు ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా ఐశ్వర్య త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలాగే కం బ్యాక్ ఇచ్చి వరుస సక్సెస్ లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఐశ్వర్య లక్ష్మి బాల్యం, కెరియర్..

1991 సెప్టెంబర్ 6న కేరళ తిరువనంతపురం లో జన్మించిన ఈమె.. ఆ తర్వాత శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎర్నాకులంలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఐశ్వర్య 2014లో మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి , ఆ తర్వాత 2017లో మలయాళంలో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది మాయానాది అనే మరో మలయాళం చిత్రంలో కూడా నటించిన ఈమె.. ప్రస్తుతం తమిళ్, తెలుగు మలయాళం భాషల్లో నటిస్తూ.. సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. మరి ఐశ్వర్య లక్ష్మీ కి ఇండస్ట్రీ ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×