E-Paper
Advertisement

Devara Pre Release Event: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?

Devara Pre Release Event: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?
Advertisement

Devara Pre Release Event: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చాలామంది జీవితాలను పూర్తిగా మార్చేసింది. అందులో జూనియర్ ఎన్‌టీఆర్ కూడా ఒకరు. అప్పటివరకు యంగ్ టైగర్‌గా ఉన్న ఎన్‌‌టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. దాని తర్వాత తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్‌టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలా అభిమానులు చేసిన పనివల్ల ప్రశాంతంగా సాగాల్సిన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సెల్ అయ్యేలా ఉంది. ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫోన్ల ముందు, టీవీల ముందు ఎదురుచూసిన అభిమానులకు ఇదొక బ్యాడ్ న్యూస్ అవ్వనుంది.

ప్రమోషన్స్ మొదలు

Advertisement

2024 సమ్మర్‌లో ‘దేవర’ మూవీ విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల అది ఏకంగా అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ ఉన్నట్టుండి అనుకున్న దానికంటే ఒక నెల ముందుగానే వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఆగస్ట్ నుండే ప్రమోషన్స్ మొదలయ్యాయి. ముందుగా ‘ఫియర్ సాంగ్’ అంటూ ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఆ తర్వాత వెంటవెంటనే రెండు పాటలు విడుదలయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పగానే ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగిపోయింది.

Also Read: ఆ సీన్స్ కాపీ కొట్టారు.. ‘దేవర’ ట్రైలర్‌పై దర్శకుడు శంకర్ షాకింగ్ ఆరోపణలు?

Advertisement

అనుకున్న దానికంటే ఎక్కువ

సెప్టెంబర్ 22న సాయంత్రం 6 గంటలకు ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో ప్రేక్షకులంతా వెయ్యి కళ్లతో ఈ ఈవెంట్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని నోవోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఫ్యాన్స్‌కు కొన్ని ఎంట్రీ పాస్‌లు పంచారు. కానీ అనుకోకుండా సాయంత్రం 6 గంటల కంటే ముందే అక్కడ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. దీంతో నోవోటెల్ సిబ్బందికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే కొందరిని మాత్రమే లోపలికి అనుమతించారు. అలా ఫ్యాన్స్‌లో ఆగ్రహం మొదలయ్యింది. నోవోటెల్ అద్దాలు బద్దలుకొట్టారు. విధ్వంసం సృష్టించారు. అలా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాదాపుగా క్యాన్సెల్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంట్రీ కష్టం

మామూలుగా స్టార్ హీరోల సినిమాల ఈవెంట్స్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో రావడం కామన్. కానీ ఈ రేంజ్‌లో జనాలు వస్తారని నోవోటెల్ యాజమాన్యం కూడా ఊహించలేదు. దీంతో వారికి కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు చేయడం కోసం సెక్యూరిటీ సిబ్భంది, పోలీసులు ఉన్నా కూడా వారు ఊహించని సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో పరిస్థితి అదుపులోకి రావడం కష్టమని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో హీరో గానీ, మూవీ టీమ్ గానీ, దర్శకుడు గానీ అక్కడికి చేరుకోవడం కష్టం కాబట్టి ఈవెంట్ క్యాన్సెల్ చేయడం బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ జనాల మధ్య ఎన్‌టీఆర్ ఎంట్రీ కష్టమే అని స్పష్టమవుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×