BigTV English

Director Shankar: ఆ సీన్స్ కాపీ కొట్టారు.. ‘దేవర’ ట్రైలర్‌పై దర్శకుడు శంకర్ షాకింగ్ ఆరోపణలు?

Director Shankar: ఆ సీన్స్ కాపీ కొట్టారు.. ‘దేవర’ ట్రైలర్‌పై దర్శకుడు శంకర్ షాకింగ్ ఆరోపణలు?

Director Shankar: టెక్నాలజీ పెరిగిన తర్వాత సినిమాలో సీన్స్ కాపీ కొడితే ఈజీగా బయటపడిపోతుంది. ఒకవేళ ఒక సినిమాలోని సీన్‌కు, మరో సినిమాలోని సీన్‌కు చాలా దగ్గర పోలికలు ఉన్నా కూడా దానిని కాపీ అని ప్రకటించేస్తున్నారు నెటిజన్లు. తాజాగా ‘దేవర’ ట్రైలర్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్ చేసిన కాపీ ఆరోపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ‘దేవర’ ట్రైలర్ విడుదలయిన సందర్భంగా శంకర్ ఒక ట్వీట్ చేశారు. అందులో ‘దేవర’ గురించి డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆయన చేసిన కామెంట్స్ మాత్రం పరోక్షంగా ఆ మూవీని ఉద్దేశించినట్టే ఉన్నాయని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.


అనుమతి లేకుండానే

కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేయగా అంతకంటే ముందే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ విడుదలయిన కాసేపటిలోనే తమిళ దర్శకుడు శంకర్ చేసిన ట్వీట్ ఒక్కసారిగా చిచ్చురేపింది. ‘అందరికీ విన్నపం. నేను ఎస్‌యూ వెంకటేశన్ రచించిన ఐకానిక్ నవల ‘వీరయుగ నాయగన్ వెళ్ పారి’కు కాపీరైట్ హోల్డర్‌గా ఉన్నాను. ఈ నవలలోని చాలా సీన్స్‌ను తీసి నా అనుమతి లేకుండానే చాలా సినిమాల్లో ఉపయోగించేస్తున్నారు’ అంటూ వాపోయాడు శంకర్.


Also Read: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

డీకోడ్‌కు ప్రయత్నం

‘ఇటీవల విడుదలయిన ఒక సినిమా ట్రైలర్‌లో నవలలోని కీలక సీన్‌ను చూసి చాలా బాధపడ్డాను. ఈ నవలలోని సీన్స్‌ను సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో, ఇంకా ఏ ఇతర మాధ్యమాల్లో కూడా ఉపయోగించకుండా ఉండాలని కోరుతున్నాను. క్రియేటర్స్ దగ్గర ఉన్న రైట్స్‌ను గౌరవించండి. అధికారం లేకుండా సీన్స్‌ను కాపీ కొట్టడం మానుకోండి లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వార్నింగ్ కూడా ఇచ్చారు శంకర్. దీంతో ఆయన అసలు ఏ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. కొందరు అయితే ఆయన ‘దేవర’ గురించే మాట్లాడుతున్నారని, కాపీ కొట్టిన నవలలోని సీన్స్‌ను డీకోడ్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్లాన్ ఫెయిల్

కొందరు నెటిజన్లు అయితే శంకర్ చేసిన ట్వీట్.. ‘కంగువా’ మూవీ గురించి అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. కానీ ‘కంగువా’ ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. కేవలం టీజర్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ‘దేవర’ గురించి శంకర్ అంత డైరెక్ట్‌గా ట్వీట్ ఎలా చేయగలిగారు అని ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడు శంకర్ చాలాకాలం క్రితమే ‘వీరయుగ నాయగన్ వెళ్ పారి’ కాపీరైట్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ కథ ఆధారంగా ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాలనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత ‘ఇండియన్ 2’ తెరకెక్కించి మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి ఏంటని ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×