BigTV English
Advertisement

Devara: ఆడియన్స్ లో తగ్గిన క్రేజ్.. రంగంలోకి దిగనున్న తారక్.. క్యాష్ చేసుకుంటారా..?

Devara: ఆడియన్స్ లో తగ్గిన క్రేజ్.. రంగంలోకి దిగనున్న తారక్.. క్యాష్ చేసుకుంటారా..?

Devara.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర (Devara). ఎన్నో విమర్శలను ఎదుర్కొని నెగెటివిటీని మూటగట్టుకొని, ఎన్నో ట్రోల్స్ మధ్య ఎట్టకేలకు సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి వరకు దేవర సినిమా డిజాస్టర్ అవుతుందని , ఎన్టీఆర్ దేవర మూవీ మరో ఆచార్య అవుతుంది అంటూ చాలామంది యాంటీ ఫ్యాన్స్ రకరకాల రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే ఆ రూమర్స్ అన్నింటినీ దాటుకుంటూ ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. మొదటి రోజే ఏకంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్లు వసూల్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మూడవ స్థానాన్ని దక్కించుకుంది దేవర.


తగ్గిన కలెక్షన్ జోరు..

ఇదిలా ఉండగా ఈమధ్య కలెక్షన్లు కాస్త తగ్గుతున్నాయని చెప్పవచ్చు. మొదటి రెండు, మూడు రోజులతో పోల్చుకుంటే ఈ మధ్య కలెక్షన్లు బాగా తగ్గిపోతున్నాయి. దీనికి తోడు రోజురోజుకి నెగిటివిటీ కూడా పెరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా దసరా, దీపావళి సెలవులు కావడం , ఈ సెలవులను క్యాష్ చేసుకోవడానికి దేవర లాంటి పెద్ద సినిమా ముందు తమ సినిమా నిలవలేదు అని, చిన్న నిర్మాతలు వెనుకడుగు వేయడం వల్లే.. దసరా, దీపావళి సెలవులు దేవరా సినిమాకి బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. కానీ ఈ సెలవులను దేవర సరిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.


రంగంలోకి దిగిన ఎన్టీఆర్..

ప్రస్తుతం పెరుగుతున్న నెగిటివిటీని తగ్గించడానికి అలాగే ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించడానికి చిత్ర బృందం ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. నిజానికి ఈ సెలవులను క్యాష్ చేసుకోవడానికి దేవర చిత్ర బృందం ప్రమోషన్స్ జోరుగా చేపట్టాలి. కానీ బృందం ప్రస్తుతం యాక్టివ్ గా కనిపించడం లేదు. అందుకే ఈ సెలవులను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఎన్టీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూలకు ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే పార్క్ హయత్ లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఎన్టీఆర్ మళ్లీ సినిమాపై హైప్ పెంచి కలెక్షన్లు రాబట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఎంతవరకు ఎన్టీఆర్ ప్రయత్నం ఫలిస్తుంది..? ఈ సెలవులను ఏ మేరకు క్యాష్ చేసుకుంటారు..? అనే విషయాలు తెలియాలంటే పూర్తి కలెక్షన్స్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

ఆ రికార్డు క్రియేట్ చేసిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ విషయానికి వస్తే .. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత.. ఆ హీరో ఏ డైరెక్టర్ తో సినిమా చేసినా సరే డిజాస్టర్ ని మూట కట్టుకుంటాడు అనే సెంటిమెంట్ ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేశారు. దేవర సినిమాతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేసి, ఆ తర్వాత దేవర 2 సినిమా చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాదు గత పది సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ విజయపరంపర కొనసాగిస్తున్న ఏకైక హీరోగా రికార్డ్ సృష్టించారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×