BigTV English

Devara: దేవర సెకండ్ సింగిల్ పోస్టర్.. రొమాంటిక్ యాంగిల్ లో ఎన్టీఆర్, జాన్వీ

Devara: దేవర సెకండ్ సింగిల్ పోస్టర్.. రొమాంటిక్ యాంగిల్ లో ఎన్టీఆర్, జాన్వీ

Devara: దేవర సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గత కొన్ని రోజుల నుంచి దేవర సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


అంతేనా ఈ సాంగ్ గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెప్పడంతో ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అందించారు. ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సెకండ్ సింగిల్.. ఆగస్టు 5 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

ఎన్టీఆర్ ఒడిలో వాలిపోయి జాన్వీకపూర్ కనిపించింది. ఇద్దరు మంచి రొమాంటిక్ యాంగిల్ లో పోజ్ ఇచ్చారు. ఇక వైట్ డ్రెస్ లో జాన్వీ.. తల్లి శ్రీదేవిని గుర్తుకు తెస్తుంది. అతిలోక సుందరిలానే ఆమె అందం మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ లో వీరి రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండనుందని నిర్మాత నాగవంశీ, కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చారు.


ఇక ఈ పోస్టర్ తో అందరికి అర్దమయ్యిపోయింది. ఈ పోస్టర్ చూస్తుంటే రతీమన్మథులు గుర్తొస్తున్నారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×