BigTV English

Telangana Job Calendar 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం

Telangana Job Calendar 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం

Telangana Job Calendar Release: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేశామన్నారు.


గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ల జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. అలాగే గతంలో రెండు సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమంతోపాటు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా చర్చ జరుగుతోందన్నారు. కొత్తగా ఉద్యోగ నియామకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.


తెలంగాణ ఆకాంక్షకు నిరుద్యోగ సమస్య బలమైన కారణమైందో అదే సమస్యను పరిష్కరించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారు. అలాగే ఏఈఈ సహా ట్రాన్స్ కో, డిస్కమ్ ల ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. దీంతోపాటు టెట్ నోటిఫికేషనల్ ఉంటుందని వెల్లడించారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు నిజం చేసేందుకు ఎన్నికల్లో హామీలు ఇచ్చిన మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. అందుకే అధికారంలోకి రాగానే నియామకాలు చేపట్టామపన్నారు. అదేవిధంగా పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే తేదీలను సైతం ముందుగానే క్యాలెండర్ ను ప్రకటిస్తున్నామన్నారు.

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే ట్రాన్స్ కో లోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్ లో నోటిఫికేషన్ ఉండగా..వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు ఉంటాయన్నారు. నవంబర్ లో టెట్..వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు, వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్..ఏప్రిల్ లో పరీక్షలు ఉంటాయన్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్..ఏప్రిల్ లో పరీక్షలు ఉంటాయన్నారు.

Also Read: మీ చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు ఉన్నది: సీఎం రేవంత్ రెడ్డి

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల..మేలో పరీక్షలు, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జూలైలో ఉంటుందన్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ లో నోటిఫికేషన్..ఆగస్టులో పరీక్షలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు జూన్ లో నోటిఫికేషన్..సెప్టెంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్..అక్టోబర్ లో పరీక్షలు, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్..నవంబర్ లో పరీక్షలు, సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి జూలై లో నోటిఫికేషన్..నవంబర్ లో పరీక్షలు ఉంటాయన్నారు.

 

Related News

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

puppy Adoption: శునకాల దత్తతకు మీరు సిద్ధమా? అయితే ఇక్కడికి వెళ్లండి!

Heavy rains alert: తెలంగాణను దంచికొట్టబోతున్న భారీ వర్షాలు.. 24 గంటల హెచ్చరిక!

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

Medak floods: గర్భగుడి వరకు చేరిన వరద నీరు.. మూసివేతలో తెలంగాణలోని ప్రధాన ఆలయం!

Heavy rains: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Big Stories

×