BigTV English

Paris Olympics: ఫైనల్‌కు దూసుకెళ్లిన మనూ భాకర్‌..గెలిస్తే సరికొత్త రికార్డు!

Paris Olympics: ఫైనల్‌కు దూసుకెళ్లిన మనూ భాకర్‌..గెలిస్తే సరికొత్త రికార్డు!

Paris Olympics Indian Shooter Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మనూ భాకర్ సత్తా చాటుతోంది. ఈ ఒలింపిక్స్‌లో మూడో పతకం సాధించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఆమె.. మరో విభాగంలోనూ విజయం సాధించింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2లో నిలిచిన ఆమె ఫైనల్స్ కు దూసుకెళ్లారు.


ఫైనల్ మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 1 గంటకు జరగనుంది. అయితే అంతకుముందు క్వాలిఫికేషన్ లో తొలుత ప్రిసిషన్ రౌండ్ లో 294 పాయింట్లు సాధించి టాప్ 3లో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ర్యాపిడ్ రౌండ్ తొలి సిరీస్ లో ఏకంగా 100 పాయింట్లు సాధించగా.. ఇదే రౌండ్ లో 296 స్కోరు దక్కించుకుంది. ఇక ఇదే విభాగంలో భారత షూటర్ ఇషా సింగ్ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.

పారిస్ ఒలింపిక్స్ లో శనివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో మనూ భాకర్ విజయం సాధిస్తే..హ్యాట్రిక్ పతకాలతో భారత ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఇప్పటికే ఈమె రెండు కాంస్య పతకాలు సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.


Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×