E-Paper
Advertisement

Devara Story Leaked : ఏంటి.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆ డిజాస్టర్ మూవీకి కాపీనా..?

Devara Story Leaked : ఏంటి.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు ఆ డిజాస్టర్ మూవీకి కాపీనా..?
Advertisement

Devara Story Leaked : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర మరో పది రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే ఓవైపు చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంటే, మరోవైపు సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో దేవర ఓ టాలీవుడ్ హీరో ప్లాప్ సినిమాకు కాపీ అనేది తాజా రూమర్. మరి అసలు దేవరను నెటిజన్లు ఏ మూవీతో పోల్చి చూస్తున్నారో తెలుసుకుందాం పదండి.

ఆ ఫ్లాప్ సినిమాకు దేవర కాపీనా?

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైన్ దేవర. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా సౌత్ లోకి అడుగు పెట్టబోతున్నారు ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఎన్టీఆర్ తో సహా దేవర టీం మొత్తం ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు దేవర స్టోరీ ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతలోనే ఈ పాన్ ఇండియా మూవీ టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన ఒక డిజాస్టర్ మూవీకి కాపీ అంటూ కొత్త వార్తలు బయలుదేరాయి.

Bhimaa Trailer : గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ 'భీమా' ట్రైలర్ వచ్చేసింది.. | Gopichand priyabhawani shankar malavika sharma bhimaa trailer released-10TV Telugu

Advertisement

దేవర స్టోరీ ఇదేనా?

కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దేవర స్టోరీ విషయానికి వస్తే.. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీకాంత్, పెద్ద ఎన్టీఆర్ ఇద్దరూ ఫ్రెండ్స్. శ్రీకాంత్ కూతురు జాన్వి. ఆమె, చిన్న ఎన్టీఆర్ లవర్స్. శ్రీకాంత్, పెద్ద ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి స్మగ్లింగ్ చేస్తారు. ఒకానొక టైమ్ లో పెద్ద ఎన్టీఆర్ స్మగ్లింగ్ మానేద్దామని చెప్తాడు. దీంతో శ్రీకాంత్ కు అది నచ్చక సైఫ్ అలీ ఖాన్ తో చేతులు కలుపుతాడు. ఆ తరువాత పెద్ద ఎన్టీఆర్ కు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని చంపుతూ వెళ్తాడు. అలా చివరికి పెద్ద ఎన్టీఆర్ ని చంపేయడం అనేది ఇంటర్వెల్ ట్విస్ట్. సెకండ్ హాఫ్ లో చిన్న ఎన్టీఆర్ రివేంజ్ తీర్చుకుంటాడు. అది కూడా దేవుడు పూనడంతో స్మాల్ ఎన్టీఆర్ తన తండ్రి చావుకు అలా రివేంజ్ తీర్చుకుంటాడు అనేది దేవర స్టోరీ అంటూ టాక్ నడుస్తోంది.

అయితే.. ఈ వార్తలు రూమర్స్ అయినప్పటికీ ఈ మూవీకి గోపీచంద్ నటించిన భీమా మూవీకి సిమిలారిటీస్ ఉన్నాయి అంటూ లింక్ పెడుతున్నారు నెటిజన్లు. భీమా మూవీలో కూడా ఇలాగే గోపీచంద్ డ్యూయల్ రోల్ చేశాడు. అందులో ఒక పాత్ర చనిపోగా, రెండవ పాత్ర చివర్లో దేవుడి అవతారంగా మారి విలన్ ను చంపేస్తుంది. మరి ప్రస్తుతం షికార్లు చేస్తున్న ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దేవర మూవీని థియేటర్లలో చూసేదాకా ఆగాల్సిందే. గతంలో కూడా ఎన్టీఆర్, గోపీచంద్ సినిమాలకు మధ్య యాదృచ్ఛికంగానే ఇలాంటి సిమిలారిటీస్ కనిపించాయి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×