BigTV English
Advertisement

Saif Ali Khan : సైఫ్ ఆలీఖాన్ ప్రభాస్ సినిమానే లెక్క చెయ్యలేదు, దీనికంటే అవమానం ఏముంది.?

Saif Ali Khan : సైఫ్ ఆలీఖాన్ ప్రభాస్ సినిమానే లెక్క చెయ్యలేదు, దీనికంటే అవమానం ఏముంది.?

Saif Ali Khan : ప్రతి హీరోకి తన కెరియర్లో ఒక సూపర్ హిట్ సినిమా ఉంటుంది. తన లైఫ్ ను కంప్లీట్ గా మార్చేసిన సినిమాలు కూడా ఉంటాయి. అలా ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. దాదాపు 5 సంవత్సరాలు పాటు ఒక సినిమాకి డేట్లు కేటాయించడం అనేది మమ్మల్ని విషయం కాదు. మొదటి ప్రభాస్(Prabhas) ఆ సినిమాను చేస్తున్నప్పుడు తెలుగులో ప్రభాస్ కి అంత మార్కెట్ ఉందా అని అందరికీ సందేహాలు ఏర్పడ్డాయి. కానీ రాజమౌళి టేకింగ్ తో ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసేలా చేసింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతూ వచ్చింది. బాహుబలి సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా ఆకట్టుకోలేకపోయింది.


బాహుబలి(Bahubali) సినిమా హిట్ అయిన తర్వాత హిందీ దర్శకులు కూడా ప్రభాస్ తో పని చేయడానికి ఆసక్తి చూపించారు. ఇక రామాయణాన్ని తెరకెక్కించే ప్రాసెస్లో ఓంరౌత్ ఆదిపురుష్ సినిమాను ప్రభాస్ వద్దకు తీసుకొని వచ్చాడు. ప్రభాస్ ఈ సినిమాలో రాముని పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పాటలు విడుదలైనప్పుడు ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ రిలీజ్ అయినప్పుడు కొంత మేరకు ట్రోల్ కూడా అయింది. ఇది ఒక మోడ్రన్ రామాయణం అంటూ అప్పట్లో టీం సమాధానం కూడా ఇవ్వటం మొదలైంది. అయితే ఈ సినిమాలో రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించాడు.

Saif Ali Khan


ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ టీజర్ కూడా రిలీజ్ అయింది. అప్పుడు చాలామంది ప్రశాంత్ వర్మా (Prasanth Varma) ను చూసి నేర్చుకో అంటూ ఓం రౌత్(Om Raut) పై కామెంట్స్ కూడా చేశారు. ఇక మొత్తానికి ఆదిపురుష్ సినిమా ఫలితం ఏంటో మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న దేవర అనే సినిమాలో సైఫ్ అలీఖాన్ ఒక విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను జరుపుతుంది చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి విడుదల చేశారు చిత్ర యూనిట్.

సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఆది పురుష్ సినిమాను తెలుగు సినిమాగా కన్సిడర్ చేయలేదా.? దర్శకుడు హిందీ అయినా కూడా ఆ సినిమాలో కనిపించింది స్టార్ తెలుగు హీరో కాబట్టి అది తెలుగు సినిమా అవుతుంది అనేది కొందరి వాదన. లేదంటే ప్రభాస్ సినిమాను సైఫ్ అలీ ఖాన్ సీరియస్ గానే మర్చిపోయాడా.? ఆ సినిమా గుర్తు లేకపోవటం ఏంటి.? అంటూ కొంతమంది నెగెటివ్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×