E-Paper
Advertisement

Devara: దేవర మూడో సాంగ్.. దేవుడా ఆ డ్యాన్స్ కు దండం పెట్టాల్సిందే

Devara: దేవర మూడో సాంగ్.. దేవుడా ఆ డ్యాన్స్ కు దండం పెట్టాల్సిందే
Advertisement

Devara: దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముందర నువ్వెంత అంటే.. బట్టలు చింపేసుకున్నారు. ఇక చుట్టమల్లే చుట్టేసింది అంటూ వస్తే.. ఆ రొమాంటిక్ మెలోడీతో ప్రేమలో పడిపోయారు. ఇక ఇప్పుడు దేవర మాస్ స్టెప్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా దేవరను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్,  సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

Advertisement

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. దేవర సినిమా నుంచి వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచేస్తున్నారు. తాజాగా దేవర నుంచి మూడో సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం పెట్టారు. దావుడి అంటూ సాగే ఈ వీడియో సాంగ్ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇందులో ఎన్టీఆర్ పై వాలిపోయి జాన్వీ నవ్వులు చిందిస్తుంది. వారి డ్రెస్ లను బట్టి ఇదొక మాస్ సాంగ్ లా అనిపిస్తుంది. చుట్టమల్లే సాంగ్ లోనే ఈ జంట క్లాస్ స్టెప్స్ తో అదరగొట్టిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు మాస్ సాంగ్ అంటే.. వీరి డ్యాన్స్ కు దండం పెట్టాల్సిందే.

Advertisement

ఇప్పటికే ఎన్నోసార్లు జాన్వీ.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని, తనకు కాళ్లు నొప్పులు కూడా వచ్చాయని చెప్పుకొచ్చి ఇంకా హైప్ పెంచేసింది. ఈ సాంగ్ లో వీరి డ్యాన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకో రెండు రోజులు ఎదురుచూడకతప్పదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×