BigTV English

Curd Health Benefits: పెరుగేకదా అని తీసిపారేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే మతిపోవాల్సిందే !

Curd Health Benefits: పెరుగేకదా అని తీసిపారేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే మతిపోవాల్సిందే !

Curd Health Benefits: పాలతో తయారు చేసే పెరుగు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెరుగు కాస్త పుల్లగా అనిపించినా రకరకాల పోషకాలు దీనిలో ఉంటాయి. ఆహారం భాగంగా కొద్దిగా పెరుగును తినడం వల్ల చర్మ ఆరోగ్యంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవల్ తగ్గి కూడా కంట్రోల్‌లో ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.


కొన్ని అధ్యయనాల ప్రకారం హైపర్ టెన్షన్ సమస్య కూడా దీని వల్ల తగ్గుతుంది. పెరుగును సరైన మోతాదులో ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గి చక్కటి ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉంటుంది. 100 గ్రాముల పెరుగులో 98 కేలరీలు, 3.4 గ్రాములు కార్బోహైడ్రేట్లు , 4.3 గ్రాముల కొవ్వులు, 11 గ్రాముల ప్రోటీన్, 360 మిల్లీ గ్రాములు సోడియం, 104 మిల్లీగ్రాముల పొటాషియంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ ఎ, డి ఉంటాయి.

పెరుగు తినడం వల్ల లాభాలు..


బరువు తగ్గడానికి:
బరువు తగ్గాలనుకునే వారు పెరుగు డైట్‌లో భాగంగా చేర్చుకోవడం మంచిది. శరీర బరువును తగ్గించడడానికి ఉపయోగపడే కాల్షియం పెరుగులో ఉంటుంది. ఇది బరువు పెరగకుండా చేస్తుంది. ఈ బెనిఫిట్స్ పొందాలంటే రోజు తినే ఆహారంలోపెరుగును చేర్చుకోవడం మంచిది.

ఎముకలకు బలం:
పెరుగులో ఉండే కాల్షియం ఫాస్పరస్, ఎముకల బలానికి ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు .పళ్ళు, ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం పెరుగులో ఉంటుంది. తరచుగా పెరుగు తినడం వల్ల ఆర్థరైటిస్, ఆస్ట్రియోఫోరోసిస్ రాకుండా ఉంటాయి.

రోగ నిరోధక వ్యవస్థ:
ప్రోబయాటిక్స్ కలిగిన ఫుడ్ శరీరానికి అవసరం ప్రోబయాటిక్స్ ఉండే ఆహారంలో పెరుగు కూడా ఒకటి. శరీరానికి సరిపడా శక్తి సామర్థ్యాలను పెంచి మెటబాలిజాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది. అందుకే తరుచుగా పెరిగు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చర్మం కోసం:
చర్మ సంరక్షణకు పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి పోషకాలు అందించి కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేలా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, జింక్ చర్మాన్ని సహజంగా కాపాడతాయి.

వెంట్రుకల ఆరోగ్యం:
డల్ హెయిర్ ఉన్నవాళ్లకు పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది. పెరుగులో న్యూట్రియంట్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. పెరుగు హెయిర్ కండీషన్ గా కూడా ఉపయోగపడుతుంది. హెన్నాతో కలిపి పెరుగు పెట్టుకోవడం వల్ల జుట్టు పెరగుతుంది.

Also Read: ఈ వాటర్ డైలీ ఒక గ్లాస్ తాగితే.. అద్భుతాలు జరుగుతాయ్ !

మానసిక ఆరోగ్యం:
పెరుగు మెదడుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఎమోషనల్ కానివ్వకుండా మెదడును సిద్ధం చేస్తుంది. అంతే కాకుండా బ్రెయిన్ హెల్త్‌కు ఇది నేచురల్ రెమెడీ.

జీర్ణక్రియ:
జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండడానికి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి శరీరంలోని పోషకాలను శరీరానికి వేగంగా అందేలా చేస్తుంది. చాలా వరకు నోటి ద్వారా వ్యాపించే జబ్బులు బ్యాక్టీరియా వల్లనే వస్తాయి. కాబట్టి పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాను శరీరంలోకి రానీయకుండా చేస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×