BigTV English

Drugs: ముందే చెప్పిన స్వేచ్ఛ.. డ్రగ్ అధికారుల మత్తు వదిలేది ఎప్పుడు?

Drugs: ముందే చెప్పిన స్వేచ్ఛ.. డ్రగ్ అధికారుల మత్తు వదిలేది ఎప్పుడు?

– మెడికల్ షాపులపై సంచలన కథనాలిచ్చిన స్వేచ్ఛ
– డ్రగ్స్‌కు డెన్స్‌గా మారిన తీరును ఎండగడుతూ వార్తలు
– అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన స్వేచ్ఛ
– విచ్చలవిడిగా మత్తు ట్యాబ్లెట్ల అమ్మకాలపై నిలదీత
– నగరంలో తాజాగా ఐదుగురు డ్రగ్స్ బానిసల అరెస్ట్
– మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్
– ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందుల కొనుగోలు
– డ్రగ్ అధికారులు మత్తులో ఉన్నారా?
– పోలీసులు అరెస్ట్ చేసే దాకా ఏం చేస్తున్నట్టు?
– ఇప్పటికైనా మత్తు వదిలి అక్రమ అమ్మకాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటారా?


దేవేందర్ రెడ్డి, 9848070809

స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం: కొద్ది రోజుల క్రితం మెడికల్ షాపుల్లో మత్తు దందాను బయటపెట్టింది స్వేచ్ఛ-బిగ్ టీవీ. సరైన రూల్స్ పాటించని బడా కంపెనీల షాపుల్లో జరుగుతున్న అమ్మకాలపై సంచలన నిజాలను బయటపెట్టింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా మంద్రుల విక్రయం, ఫార్మాసిస్టులు లేకుండా సాగిస్తున్న దందాను పక్కా ఆధారాలతో జనం ముందు ఉంచింది. అధికారులు సైతం కుమ్మక్కు అయి సాగిస్తున్న ఈ వ్యవహారంలో తాజాగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్వేచ్ఛ-బిగ్ టీవీ చెప్పేది అక్షర సత్యం అని రుజువైంది.


నగరంలో ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో ఐదుగురు డ్రగ్స్ బానిసలను అరెస్ట్‌ చేశారు పోలీసులు. వీరు మత్తు టాబ్లెట్స్‌ను నీళ్లలో కరిగించి ఇంజెక్ట్ చేసుకుంటున్నట్టు తేలింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో ఐదుగురు మత్తులో ఉండగా అరెస్ట్ చేశారు. నిట్రోవిట్, ట్రమడోల్‌, టైడోల్ టాబ్లెట్స్‌‌ను వీరు వాడినట్లు గుర్తించారు. మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐదుగురిని అరెస్ట్ చేయగా, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరు మిజోరం రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. మెడికల్‌ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్‌ కొంటున్నారని వివరించారు పోలీసులు. దీంతో స్వేచ్ఛ ముందుగా హెచ్చరించిందే నిజమని తేలింది.

దందాను ముందే బయటపెట్టిన స్వేచ్ఛ-బిగ్ టీవీ

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో, తమ వంతు బాధ్యతగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు స్వేచ్ఛ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మెడికల్ షాపులు డ్రగ్స్‌‌కు డెన్స్‌గా మారుతున్నాయని గుర్తించి, ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. పక్కా ఆధారాలతో కథనాలు ఇచ్చింది. తాజా కేసుతో స్వేచ్ఛ-బిగ్ టీవీ చెప్పింది నిజమేనని రుజువైంది.

డ్రగ్ కంట్రోల్ అధికారులు నిద్ర లేస్తారా?

యువత మత్తు బారిన పడకుండా ఉండేందుకు, మెడికల్ షాపులను ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల నిర్లక్ష్యాన్ని, బడా కంపెనీలతో జరిపిన డీలింగ్స్‌ను స్వేచ్ఛ-బిగ్ టీవీ బయటపెట్టింది. చివరకు పోలీసులు పలువుర్ని అరెస్ట్ చేసే దాకా వచ్చింది. ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు మత్తు వదిలి, మత్తు మందుల అమ్మకాలపై దృష్టి పెట్టాలి. విచ్చలవిడిగా సాగుతున్న దందాపై ఉక్కుపాదం మోపాలి. లేకపోతే, ఇంకా ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది.

Related News

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Big Stories

×