BigTV English

Devara: సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించిందెవరంటే..?

Devara: సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించిందెవరంటే..?

Devara.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. సెప్టెంబర్ 27వ తేదీన విడుదలై మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకొని, మొదటి రోజు ఏకంగా రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఒక ఇండియాలోనే కాదు అమెరికా గడ్డ పైన కూడా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు మొదటి రోజు కలెక్షన్స్ కలిపి 4 మిలియన్ డాలర్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా జోరు బాగా పెరిగింది అని చెప్పాలి. దీనికి తోడు ఈరోజు, రేపు వీకెండ్స్ కావడం కూడా దేవర సినిమాకి బాగా కలిసొస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi kapoor) నటించగా, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని కట్టిపడేశారు.


సైఫ్ అలీ ఖాన్ భార్యగా బుల్లితెర నటి.

బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్, శృతి మరాఠీ (Shruti Marathi)తో పాటు మరొక బ్యూటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించి ఆకట్టుకుంది. ఆమె ఎవరో కాదు కన్నడ , తెలుగు భాషల్లో బుల్లితెరపై భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అందాల బ్యూటీ చైత్ర రాయ్ (Chaitra Rai). ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగితే మాత్రం ఇక స్మాల్ స్క్రీన్ కి స్వస్తి చెప్పి సిల్వర్ స్క్రీన్ పై సెటిల్ అయిపోవడం ఖాయం అంటూ ఈమె అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.


చైత్ర రాయ్ కెరియర్..

ఇక చైత్ర రాయ్ విషయానికొస్తే.. అష్టా చమ్మా సీరియల్ తో తొలిసారి తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యింది. ప్రస్తుతం రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీకి చెందిన చైత్ర కన్నడ సీరియల్స్ తోనే కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు సీరియల్స్ లో అవకాశం అందుకొని ఇప్పుడు మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ తెలుగు సీరియల్సే ఈమెకు సినిమాలలో అవకాశం కల్పించేలా చేశాయి. అలా ఏకంగా పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకొని విలన్ భార్యగా నటించి అందరినీ ఆకట్టుకుంది.

చైత్ర రాయ్ నటించిన తెలుగు సీరియల్స్..

చైత్ర రాయ్ నటించిన తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే , అష్టాచమ్మా, దటీజ్ మహాలక్ష్మి, అత్తారింట్లో అక్క చెల్లెలు వంటి సీరియల్స్ ఈమెకు మంచి పేరు అందించాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే చైత్ర రాయ్.. తన కూతురు, భర్తతో కలిసి సందడి చేస్తూ ఉంటుంది. రకరకాల ఫోటోషూట్లతో పాటు వారి ఇంట్లో జరిగే ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలాగే అందచందాలతో ఆకట్టుకుంటుంది చైత్ర రాయ్.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Chaithra Rai (@chaithrarai17)

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×