BigTV English

Roja new plan: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

Roja new plan: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

Roja new plan: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు, ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో తెలీదు. ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తారు కొందరు. ఈ విషయంలో కొందరు సక్సెస్ అవుతారు.. మరికొందరు ఫెయిల్ అవుతారు. ప్రస్తుతం మాజీ మంత్రి రోజా కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.


తాను వైసీపీని వదిలేదని లేదని 20 రోజుల కిందట కుండబద్దలు కొట్టింది మాజీ మంత్రి రోజా. తిరుమల లడ్డూ వివాదంతో వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని గమనించింది మాజీ మంత్రి రోజా. వైసీపీ ఉంటే లైఫ్ ఉండదని భావించినట్టు ఉన్నారో ఏమోగానీ, ఈ మధ్య తమిళనాడులో దర్శనమిస్తున్నారు.

అన్నట్లు.. శనివారం దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలని జగన్.. నేతలకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కానీ రోజా మాత్రం..  గతరాత్రి మధురై వెళ్లి మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన రోజా, తిరుమల లడ్డూ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు.


తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్- కార్తీ మధ్య చిన్నపాటి మాటల వాగ్వాదం జరిగింది. చివరకు కార్తీ, ఆయన అన్న సూర్య కూడా క్షమాపణలు చెప్పారు. ఈ విషయంలో తమిళ తంబీలు కార్తీకి మద్దతుగా నిలిచారు. తమిళనాడు ట్రెండ్‌ని గమనించిన రోజా, తిరుమల లడ్డూ వివాదాన్ని అక్కడా లేవనెత్తారు. తమిళనాడులో పవన్‌పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడినట్టు కనిపిస్తున్నారు.

ALSO READ: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు.. సెప్టెంబర్ 30న విచారణ

మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా హీరో విజయ్ పార్టీ పెట్టాడు (ఈ హీరో ‘అదిరింది’ మూవీతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు). సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రయత్నంలో పడ్డారాయన. తెలుగులో కంటే తమిళంలో రోజా ఎక్కువ సినిమాలు చేసింది. తమిళ బాష సమస్య ఉండదు.

తప్పా.. రైటా అనేది పక్కనపెడితే ప్రత్యర్థులపై బాణాలు ఎక్కుపెట్టడంలో రోజాకు తిరుగులేదని కొందరు నేతలు చెబుతారు. లడ్డూ విషయాన్ని ప్రస్తావించి విజయ్ పార్టీ వైపు వెళ్లేందుకు రోజా వేసిన ఎత్తుగడగా జనసేన కార్యకర్తలు వర్ణిస్తున్నారు. పవన్ పేరు చెప్పి అక్కడ తమిళ తంబీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని సోషల్ మీడియా వేదికగా దుయ్యబడుతున్నారు.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×